క్రీడలుజనరల్ప్రత్యేకంబ్రేకింగ్ న్యూస్

బెంగళూరుపై గెలవాల్సిన హైదరాబాద్ ఇలా ఓడింది

Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore match result

ఐపీఎల్ ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ లో ఉత్కంఠ ఊపేసింది. బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది. గెలుస్తుందనుకున్న సన్ రైజర్స్ ఓడిపోగా.. ఓడిపోతుందనుకున్న బెంగళూరును బౌలర్లు గెలిపించారు. 50 పరుగులు చేయలేక చివరి 9 వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ దారుణ పరాజయం పాలైంది.

తొలి మ్యాచ్ లో భారీగా పరుగులు ఇచ్చిన హైదరాబాద్ బౌలర్లు రెండో మ్యాచ్ లో మాత్రం విరాట్ కోహ్లీ సేనను కట్టిపడేశారు. పరుగులు చేయడానికి శ్రమించేలా చేశారు.

హైదరాబాద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోహ్లీ సేన 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ ఒక్కడే 59 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.

టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. క్రీజులోకి వచ్చిన పడికల్ త్వరగా ఔట్ కాగా కోహ్లీ, మ్యాక్స్ వెల్ మాత్రమే నిలబడి పరుగులు చేశాడు. కోహ్లీ 33 ఔట్ అయ్యాక డివిలియర్స్ కూడా త్వరగా పెవిలియన్ చేరాడు. మ్యాక్స్ వెల్ ఆఖర్లో సిక్సులు, ఫోర్లు కొట్టడంతో బెంగళూరు 149 పరుగులకు చేరుకుంది. హోల్డర్ 3, రషీద్ 2 వికెట్లు తీసుకున్నారు.

ఇక బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట నిలకడగా ఆదింది.. ఓపెనర్లు వార్నర్, సాహా నెమ్మదిగా ఆడారు. ఇక సాహాను సిరాజ్ స్లిప్ లో క్యాచ్ ద్వారా ఔట్ చేశాడు. హైదరాబాద్ 2.2 ఓవర్ల సమయంలో సాహా 1 పరుగుకే ఔట్ అయ్యాడు. వార్నర్, మనీష్ పాండేలు కలిసి కదురుగా ఆడి సన్ రైజర్స్ ను 100 పరుగులు దాటించారు. అయితే షాబాజ్ ఓకే ఓవర్లో 3 వికెట్లు తీసి సన్ రైజర్స్ ను చావు దెబ్బ తీశాడు.

అయితే వరుసగా వార్నర్ , ఆ తర్వాత బెయిర్ స్టో, మనీష్ పాండే, అబ్దుల్ సమద్ , విజయ్ శంకర్, జేసన్ హోల్డర్ లు వరుసగా ఔట్ కావడంతో సన్ రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది.చివరలో వరుసగా వికెట్లు పడడంతో ఓడిపోయింది. ఒక దశలో వార్నర్, పాండే 100 పరుగులపైనే పరుగులు చేసి పునాది వేయగా.. తర్వాత 50 పరుగులు చేయలేక 9 మంది బ్యాట్స్ మెన్ వరుసగా ఔట్ కావడం.. బెంగళూరు బౌలర్లు అద్భుతంగా ఆడడంతో సన్ రైజర్స్ ఓడిపోయింది. ఓటమి అంచుల నుంచి బెంగళూరు గెలవగా.. సన్ రైజర్స్ గెలవాల్సిన మ్యాచ్ ను ఓడిపోయింది.

Back to top button