ఆరోగ్యం/జీవనం

వాము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

Ajwain

ప్రస్తుత కాలంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మనలో చాలామంది మందులు వాడుతున్నారు. తరచూ మందులను వాడటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అయితే వాము తినడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ ను తిరిగి పొందవచ్చు. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో వాము సహాయపడుతుంది. సువాసనను కలిగి ఉండే వాము శరీరంలో వాతాన్ని హరింపజేయడంలో సహాయపడుతుంది.

వాము కడుపు ఉబ్బరం సమస్యకు చెక్ పెట్టడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలను సులువుగా దూరం చేస్తుంది. వామును నీటితో కలిపి తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. జలుబు, దగ్గు సమస్యలకు చెక్ పెట్టడంలో వాము తోడ్పడుతుంది. చూడటానికి జీలకర్రలా కనిపించే వాము పరిమాణంలో మాత్రం జీలకర్ర కంటే చిన్నదిగా ఉంటుంది.

మురుకులు, జంతికల తయారీలో వామును ఎక్కువగా ఉపయోగిస్తారు. వాము నీళ్లలో నానబెట్టి కొంచెం ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. దంత సమస్యలకు చెక్ పెట్టడంలో వాము తోడ్పడుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్ పెట్టడంలో వాము ఉపయోగపడుతుంది. వాము నూనె కీళ్ల నొప్పులను తగ్గించడంతో పాటు కాలిన గాయాలను తగ్గిస్తుంది. తమలపాకుతో వామును కలిపి తీసుకుంటే పొడిదగ్గు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

వామును మెత్తగా దంచి మజ్జిగలో కలిపి తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్యలు దూరమవుతాయి. ఇతర అరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో వామును తీసుకుంటే శరీరానికి లాభమే తప్ప నష్టమే లేదు.

Back to top button