సినిమా

షూటింగుకు రెడీ అవుతున్న  సూపర్ స్టార్? 

సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసే అవకాశం....

rajinikanth
కరోనా మహ్మమరి కారణంగా సినిమా షూటింగులు వాయిదాపడగా.. థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. అయితే ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులకు అనుమతించడంలో ఇప్పుడిప్పుడే చిత్రసీమలో సందడి మొదలైంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే సినిమాలను చేసేందుకు దర్శక, నిర్మాతలు, హీరోహీరోయిన్లు, సాంకేతిక నిపుణులు, నటీనటులు రెడీ అవుతున్నారు.
ఇప్పటికే చిన్న సినిమాలు, టీవీ షోలు షూటింగులు జరుపుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు పెద్ద సినిమాలుగానీ.. స్టార్ హీరోలుగానీ షూటింగులో పాల్గొనడం లేదు. కరోనా ఇంకా తగ్గముఖం పట్టకపోవడం స్టార్ హీరోహీరోయిన్లంతా వేచిచూసే ధోరణిలో ఇన్నిరోజులు ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా స్టార్ హీరోహీరోయిన్లు, అగ్రదర్శకులు అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే సినిమాలు తీసేందుకు మొగ్గుచూపుతుండటంతో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ఓవర్ బడ్జెట్ పై రాజమౌళి ప్లాన్ !

తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం ‘అణ్ణాత్త’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో నయనతార, కీర్తి సురేష్, సీనియర్ హీరోయిన్లు ఖుష్బూ, మీనా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కరోనాకు ముందుగానే ఈ మూవీ షూటింగు హైదరాబాద్లో కొంతమేర జరిగింది. కరోనా విజృంభిస్తుండటంతో ఈ సినిమా షూటింగు వాయిదా పడింది.

Also Read: దర్శకుడి వికృత చేష్టల పై హీరోయిన్ ఫిర్యాదు !

‘అణ్ణాత్త’ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన సెట్స్ రామోజీ ఫిల్మ్ సీటీలో వేశారు. త్వరలోనే చిత్రయూనిట్ హైదరాబాద్ వచ్చేందుకు సన్నహాలు చేసుకుంటోంది. విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ 2 నుంచి ‘అణ్ణాత్త’ షూటింగ్ హైదరాబాద్లో జరుగనుంది. దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావించింది. అయితే కరోనా కారణంగా సినిమా ఆలస్యం అవుతుండటంతో వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Back to top button