టాలీవుడ్సినిమా

రెండో పెళ్లిపై సురేఖవాణి స్పంద‌న‌.. నిజం చెప్పిన నటిమ‌ణి!

Surekha Vani
సింగ‌ర్ సునీత రెండో పెళ్లి టాలీవుడ్లో ఎంత‌ హాట్ టాపిక్ అయ్యిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. అప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం సినిమా ప్రియుల‌కు మాత్ర‌మే తెలిసిన ఆమె పేరు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అంద‌రికీ తెలిసిపోయింది. మొద‌టి భ‌ర్త‌తో విడిపోయి చాలాకాలంగా పిల్ల‌ల‌తో ఒంట‌రిగా ఉంటున్న సునీత.. గ‌త జ‌న‌వ‌రిలో ‘మ్యాంగో’ అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read: ఉప్పెన టీం సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి

అయితే.. ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకోవడంతో.. టాలీవుడ్లో సింగిల్ గా ఉంటున్న నటీమణుల గురించి చర్చ మొదలయ్యింది. వారు కూడా సునీత లాగే రెండో పెళ్లి చేసుకుంటారా? అనే డిస్క‌ష‌న్ కొన‌సాగుతోంది. వీరిలో ప్ర‌ధానంగా నటి సురేఖవాణి, యాంకర్ క‌మ్‌ నటి ఝాన్సీపై మీద అంద‌రి దృష్టీ పడింది. తాజాగా కొన్ని వెబ్ సైట్లు కూడా ఈ వార్త‌ను రాసేశాయి. త్వ‌ర‌లోనే సురేఖ వాణి పెళ్లి చేసుకోబోతున్నార‌ని క‌థ‌నాలు ప్ర‌చురితం అయ్యాయి.

ఈ విష‌యం ఆమే ప్ర‌క‌టించారంటూ ఓ ఫేస్ బుక్ పోస్టును కూడా చూపించాయి. గ‌డిచిన రెండు రోజులుగా ఈ ప్ర‌చారం మ‌రింత ఎక్కువైంది. సోష‌ల్ మీడియాలో ఈ విష‌యంపై డిస్క‌ష‌న్ పెరుగుతోంది. ఈ సంగ‌తి సురేఖ వాణి వ‌ద్ద‌కు వెళ్ల‌డంతో ఆమె ఇన్ స్టా వేదిక‌గా స్పందించారు. తన రెండో పెళ్లిపై ఓ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన వార్త, దానికి యాడ్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను స్క్రీన్ షాట్ తీసి, త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు సురేఖవాణి. ఈ పోస్టుకు ‘ఫేక్ న్యూస్’ అని రాశారు.

Also Read: శంకర్ -రాంచరణ్ సినిమాలో పవన్ ప్లేసులో కోలివుడ్ స్టార్

అంతేకాదు.. అసలు తనకు ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లే లేవని సురేఖవాణి స్పష్టం చేశారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉందని ఆమె వెల్లడించారు. దీంతో.. సురేఖ వాణి రెండో పెళ్లి అనేది వ‌ట్టి పుకారే అన్న విష‌యం తేలిపోయింది. ఆ ఫేస్ బుక్ పోస్టు కూడా ఫేక్ అని అర్థ‌మైంది.

కాగా.. సురేఖవాణి భర్త సురేష్ తేజ 2019లో అనారోగ్యంతో చ‌నిపోయారు. ఈ దంపతులకు సుప్రీత అనే కూతురు ఉంది. సురేఖవాణి టాలీవుడ్ లో ఫేమ‌స్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఇటీవ‌ల ఆమె ‘డర్టీ హరి’ అనే సినిమాలో న‌టించారు. తెలుగుతోపాటు ఇత‌ర భాష‌ల్లోనూ న‌టిస్తున్నారు సురేఖ‌. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా త‌న‌కు సంబంధించిన విశేషాల‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు సురేఖ వాణి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button