అత్యంత ప్రజాదరణజాతీయంరాజకీయాలుసంపాదకీయం

సర్వే: బెంగాల్ మమతదే.. మోడీ ఫెయిల్ అవ్వడం ఖాయమే

Survey: Bengal Mamata Banerjee .. Modi is sure to fail

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న ఫలితం ‘పశ్చిమ బెంగాల్ ఎన్నికలు’ ఈ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయనే అంశం గురించి వెలువడుతున్న వివిధ సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి.

ఓవైపు మోడీ.. మరోవైపు అమిత్ షా మోహరించిన వేళ బెంగాల్ పీఠం మూడోసారి కూడా మమతా బెనర్జీకే దక్కుతుందనేది ఇప్పటివరకు వెలువుడుతున్న సర్వేలను బట్టి తెలుస్తోంది.

తాజాగా వెలువడిన టౌమ్స్ నౌ-సీఓటర్ సర్వే కూడా ఇదే ఫలితాన్ని వెల్లడించడం విశేషం. ప్రీ పోల్ సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ మెజారిటీ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. 294 సీట్లు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో మమత టీఎంసీకి 146-163 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. అంటే కనీసం మెజారిటీ మమతాకు రావచ్చని.. ఆమె మూడోసారి సీఎం అవుతారని తేల్చింది. ఇక బీజేపీకి 99-115 సీట్ల వరకు సాధించవచ్చని సర్వే అంచనావేసింది. అయితే బీజేపీ బలంగా పుంజుకుంటుందని తేల్చింది.

గత బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. గత ఐదేళ్లలో ప్రత్యామ్మాయ శక్తిగా ఎదిగింది. సర్వశక్తులు ఒడ్డినా మోడీషాలు ప్రచారం చేసినా కూడా బెంగాల్ లో మమతా గెలుపు గ్యారెంటీ అన్న సంకేతాలు సర్వే ద్వారా తేలాయి.

* పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు-2021-‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే నివేదిక

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు తథ్యమని మరో సర్వే తేల్చింది. రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వంపట్ల నెలకొన్న వ్యతిరేకతే దీనికి కారణం అని వివరించింది. పశ్చిమ బెంగాల్ లో ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులు పర్యటించి రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ డైరెక్టర్, రీసెర్చర్ డాక్టర్ సజ్జన్ కుమార్ ఈ నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు.
• మమతా బెనర్జీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఈసారి బీజేపీకి లబ్ది చేకూరే అవకాశముంది.
• అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి.
• రాష్ట్రవ్యాప్తంగా 160 స్థానాల్లో బీజేపీకి అనుకూలత కన్పిస్తోంది.
• రాష్ట్రంలోని 70 స్థానాల్లో మాత్రమే తృణమూల్‌ కాంగ్రెస్ కు అనుకూలత కన్పిస్తోంది.
• 12 స్థానాల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమికి అనుకూలత ఉంది.
• దాదాపు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ-టీఎంసీ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా పోటీ నెలకొంటుందని సర్వే తేల్చింది.

Back to top button