అంతర్జాతీయం

Taliban: తాలిబన్ సర్కార్ ను నడిపిస్తున్న చైనా, పాక్.. వీళ్ల ప్లానేంటి?

అఫ్గనిస్తాన్ లో పరిణామాలు మారుతున్నాయి. తాలిబన్లు అఫ్గాన్ ను పూర్తిగా ఆక్రమించుకోవడంతో పరిపాలనపై పట్టు

Taliban: China and Pakistan Leading The Taliban Government

Taliban: అఫ్గనిస్తాన్ లో పరిణామాలు మారుతున్నాయి. తాలిబన్లు అఫ్గాన్ ను పూర్తిగా ఆక్రమించుకోవడంతో పరిపాలనపై పట్టు బిగుస్తోంది. అఫ్గనిస్తాన్ విషయంలో ప్రపంచం యావత్తు ఆందోళన చెందుతోంది. వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లకు పాకిస్తాన్ పరోక్షంగా సాయం అందజేస్తోంది. దీంతో వారి ప్రభుత్వ ఏర్పాటులో కూడా తనదైన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. అఫ్గనిస్తాన్ విషయంలో పాక్ పాత్ర ప్రముఖంగా వినిపిస్తోంది. అన్ని విషయాల్లో పాక్ వెనకుండి మరీ తన పరపతి ప్రయోగిస్తోందని సమాచారం.

తాలిబన్ల పుట్టుకకు కూడా పాక్ దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. అఫ్గాన్ లో ప్రాధాన్యం కోల్పోకుండా ఉండేందుకు ఆ దేశ సైన్యం, ఇంటెలిజెన్స్ విభాగాల్లో సాయం అందిస్తూ తన ప్రభావం చూపెడుతోంది. తాలిబన్లకు ఆయుధాలు సరఫరా చేయడానికి కూడా పాక్ రవాణా సదుపాయాలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల అఫ్గాన్ లో తొలి విదేశీ విమానం ల్యాండ్ అయింది. అది కూడా పాకిస్తాన్ దే కావడం గమనార్హం. దీంతో తాలిబన్లకు పాకిస్తాన్ కు ఉన్న సంబంధం ఏమిటో తెలుస్తోంది.

ఇక తాలిబన్లు చైనా తో కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. వారి మనుగడ కోసం చైనా సాయం తీసుకుంటున్నట్లు సమాచారం. తాలిబన్లు కాబుల్ ను ఆక్రమించుకున్నాక కూడాచైనా రాయబార కార్యాలయం కొనసాగుతూనే ఉంది. దీన్ని బట్టి తాలిబన్లకు చైనా ఏ మేరకు సాయం చేస్తోందో తెలుస్తోంది. తాలిబన్లపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతామండలిలో వీటో అధికారం ఉన్న చైనాతో సత్సంబంధాలు ఉంటే పనికొస్తాయని భావించిన తాలిబన్ల చైనాతో దోస్తీ కడుతున్నాయి.

అఫ్గాన్ లో వ్యాపారాలు సజావుగా సాగాలంటే చైనా సాయం అవసరమని తాలిబన్లు భావిస్తున్నారు. అమెరికా సేనలు అఫ్గాన్ లో ఉంటే భారత్ కు ప్రయోజనం చేకూరుతుందని భావించి చైనా ఈ కుట్రలకు తెరలేపిందని సమాచారం. అమెరికా శక్తిని దగ్గరకు రానివ్వద్దనే ఉద్దేశంతోనే చైనా ఈ కుట్రలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే భారత్ ను శత్రువుల్లా భావించే చైనా, పాకిస్తాన్ తాలిబన్ల కు సాయం చేయడంతో వారిని కూడా తమ వైపు తప్పుకుని భారత్ పై దాడికి పాల్పడే సూచనలు ఉన్నట్లు హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో భారత్ లోని కశ్మీర్ వంటి అంశాన్ని వివాదస్పదం చేయడానికి తాలిబన్లు ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది. దీంతో తాలిబన్ల ముప్పును తప్పించుకునేందకు భారత్ కూడా తగు విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Back to top button