అంతర్జాతీయంరాజకీయాలు

Taliban: పార్కుల్లో సేదతీరుతున్న తాలిబన్లు

talibans enjoy amusement parks in kabul

తుపాకులు చేతబట్టి మనుషులను క్రూరంగా చంపే తాలిబన్లు ఇప్పుడు సేదతీరుతున్నారు. అప్ఘనిస్తాన్ ను ఆక్రమించుకొని రాజధాని కాబూల్ నగరంలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాబూల్ నగరంలో జెండా పాతిన అనంతరం ఈ సిటీలోని అమ్యూజ్ మెంట్ పార్కుల్లో చేరి ఎంజాయ్ చేయడం ప్రారంభించారు.

విశేషం ఏంటంటే భుజాలపై రైఫిళ్లను మాత్రం వదలకుండా తాలిబన్లు ఈ పార్కుల్లోని ఎలక్ట్రిక్ బంపర్ కార్లలో ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే పార్కులో పిల్లలు ఆడుకునే చిన్నపాటి బొమ్మ గుర్రాలపై ‘స్వారీ’ చేస్తూ కనిపించారు.

ఇక విశేషం ఏంటంటే కొందరు తాలిబన్ ఫైటర్లు.. అప్ఘనిస్తాన్ లో చిక్కుకుపోయిన అమెరికన్ల తరలింపులో అమెరికా సైనిక దళాలకు సాయపడ్డారట.. అప్ఘన్ భాష అర్థం కాకపోతే ట్రాన్స్ లేటర్లుగా మారి అమెరికన్ల సమస్యలు తీర్చారని తెలిసింది. ఈ క్రమంలోనే అమెరికా సైనికులు కూడా తాలిబన్ల పట్ల మెతకగా వ్యవహరించినట్లు సమాచారం.

కాబూల్ లోని పార్లమెంట్ భవనంలో ప్రస్తుతం తాలిబన్లు తిష్టవేసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మజారే షరీఫ్ లో మాజీ అప్ఘన్ సైన్యాధికారి హిబాతుల్లా అలీ జాయ్ విలాసవంతమైన నివాసంలో తాలిబన్లు తెగ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం కాబూల్ ను ఆక్రమించిన తాలిబన్లు తమకు ఎదురే లేకపోవడంతో ఎక్కడ చూసినా వీరే కనిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాలిబన్లను చూసి మహిళలు, యువతులు తమ భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Back to top button