అంతర్జాతీయంరాజకీయాలు

అదృష్టం అంటే అతడితే.. రాత్రికిరాత్రే కోటిశ్వరుడయ్యాడు..!


అప్పుడప్పుడు కొందరీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతుంటాయి.. అలాంటిదే ఇప్పుడు చెప్పబోయే సంఘటన.. అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో అనడానికి ఇదొక ప్రతక్ష్య ఉదాహరణగా నిలుస్తుంది. అతనొక కూలీ.. గనిలో పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.. రోజులానే ఆరోజు కూడా పనికి వెళ్లాడు.. అదే అతడి జీవితాన్ని మార్చేవేసింది.. అప్పటిదాకా గని కార్మికుడిగా కాలం వెళ్లదీసిన అతడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కరోజులోనే ఆ వ్యక్తి కోటిశ్వరుడిగా మారాడు.. దీంతో అదృష్టం అంటే అతడి దేనని తోటి కార్మికులు జలసీ ఫీలవుతున్నారు. ఈ సంఘటన ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో జరిగింది.

మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

ఆఫ్రికాలోని టాంజానియా గనుల్లో లైజర్ అనే వ్యక్తి కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా గనిలో తవ్వకాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే ఆరోజు కూడా లైజర్ గనిలో తవ్వకాలు చేపట్టాడు. అయితే అతడికి ఉన్నట్టుండి రెండు పెద్ద రత్నాలు లభించాయి. లైజర్ ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం అతడికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి వాటిని కొనుగోలు చేసింది.

ఆ రెండు రత్నాలకు ప్రభుత్వం ఏకంగా అతడికి రూ.25కోట్లను చెల్లించింది. ఇంకేముందీ అతడు రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. రెండు రత్నాల్లో ఒకటి 9.27కేజీల బరువు ఉండగా, మరొకటి 5.10కిలోల బరువు ఉందని సమాచారం. మిరేరానీ గనుల్లో ఎప్పటి నుంచో తవ్వకాలు జరుపుతున్నా.. ఇంత భారీ సైజులో రత్నాలు ఎప్పుడు లభించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదటిసారి అంతపెద్ద రత్నాలు దొరికినట్లు ప్రభుత్వం ప్రకటించడం విశేషం.

‘బీహార్‌ ఎన్నికల కోసం బీజేపీ గల్వాన్‌ నాటకం!’

అదృష్టమంటే లైజర్ దేనని తోటి కార్మికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తమకెప్పుడు ఆ అదృష్టం వస్తుందోనంటూ ఆశతో మరింత ఉత్సాహంతో పని చేస్తున్నారు. వీరిలో ఇంకేంతమంది అదృష్టవంతులుగా మారుతారో వేచి చూడాల్సిందే..! అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే అతడు గని కార్మికుడిగా పని చేసేనందుకు వల్లే అతడికి అదృష్టం లభించిందనే విషయాన్ని మర్చిపోకూడదు.. ప్రతీఒక్కరు పెద్ద జీతం.. మంచి పని వస్తేనే చేస్తా అని ఖాళీగా కూర్చోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోతే ఏదొక ఒకరోజు అదృష్టం కలిసొస్తుందనేది ఈ సంఘటన ద్వారా అర్థం అవుతుంది.