జనరల్వ్యాపారము

సూపర్ స్కీమ్.. పన్నుఆదాతో పాటు కోటీశ్వరులయ్యే ఛాన్స్..?

మనలో చాలామంది ఉద్యోగులు, వ్యాపారులు లక్షల్లో ట్యాక్స్ కడుతూ ఉంటారు. అయితే కొన్ని స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పన్నును ఆదా చేసుకోవచ్చు. అలా పన్ను ఆదా చేసుకోవడానికి ఉన్న స్కీమ్ లలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. దీర్ఘకాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఇదే బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అదిరిపోయే రాబడిని పొందే అవకాశం ఉంటుంది.

సంవత్సరానికి 46 వేల రూపాయల వరకు ఈ స్కీమ్ ద్వారా పన్ను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే తక్కువ కాలం ఈ స్కీమ్ లొ ఇన్వెస్ట్ చేసినా ఎక్కువగా ఫలితం ఉండదు. కనీసం 10 నుంచి 20 సంవత్సరాలు ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో 10 సంవత్సరాల సగటు రాబడి 11 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

ప్రతి ఏడాది ఈ స్కీమ్ లో డబ్బులను డిపాజిట్ చేయడం ద్వారా 20 సంవత్సరాల తర్వాత కోట్ల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో లక్ష రూపాయల వరకు క్యాపిటల్ గెయిన్స్ పై మినహాయింపు లభిస్తుంది కాబట్టి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. అయితే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి కనీసం మూడు సంవత్సరాల పాటు లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మెచ్యూరిటీ డబ్బుపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్ పై పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉండటంతో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని చెప్పవచ్చు.

Back to top button