ఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

తిరుప‌తిలో టీడీపీ స‌ర్వే.. షాకింగ్‌ రిపోర్టు?

Chandrababuఅసెంబ్లీ ఎన్నిక‌ల పోరులో తెలుగు దేశం పార్టీ దారుణ ప‌రాభ‌వానికి గురైంది. అప్ప‌టి వ‌ర‌కూ అధికారంలో ఉన్న పార్టీ.. కేవ‌లం 23 స్థానాల‌కు ప‌డిపోవ‌డం నివ్వెర ప‌రిచింది. టీడీపీ నాయ‌కులు, పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేక‌పోయాయి. జ‌నాలు త‌ప్పు చేశారంటూ ప‌లుమార్లు వ్యాఖ్యానించారు చంద్ర‌బాబు. కానీ.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ అదే ఫ‌లితం పున‌రావృతం కావ‌డం చంద్ర‌బాబు పెద్ద షాక్‌.

ఇలాంటి ప‌రిస్థితుల్లో తిరుప‌తి ఉప ఎన్నిక స‌వాల్ గా మారింది. ఇక్క‌డ గెలుపు.. పార్టీకి ఊపిరి పోయ‌డం లాంటిద‌ని భావిస్తున్నారు. అందుకే.. ఏం చేసైనా గెలుపు సాధించాల‌ని ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు చంద్ర‌బాబు అండ్ కో. ఈ నేప‌థ్యంలో.. అస‌లు తిరుప‌తి ప్ర‌జ‌ల నాడి ఏంట‌ని తెలుసుకునేందుకు స్వ‌యంగా రంగంలోకి దిగిందట టీడీపీ బృందం.

ప్ర‌తీ ఎన్నిక ముందు వివిధ సంస్థ‌లు స‌ర్వేలు చేస్తూనే ఉంటాయి. పార్టీలు కూడా ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాయి. త‌ద్వారా.. ఎక్క‌డ బ‌లం ఉంది..? ఎక్క‌డ బ‌ల‌హీన‌త ఉంది? ఎన్నిక నాటికి ఎలా స‌రిదిద్దుకోవాలి? అనే అంశాల‌పై దృష్టిపెట్టేందుకు స‌ర్వేలు చేయిస్తూనే ఉంటారు. అయితే.. టీడీపీ చేయించిన స‌ర్వే రిపోర్టు చూసి పార్టీ నేత‌లు కూడా షాకైన‌ట్టు తెలుస్తోంది.

తిరుప‌తి గ‌త ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థిగా ఉన్న ప‌న‌బాక ల‌క్ష్మికి 37.65శాతం ఓటు షేరింగ్ తో.. 4,94,501 ఓట్లు వ‌చ్చాయి. అయితే.. ఈ సారి అంత‌క‌న్నా త‌క్కువ ఓట్లు వ‌స్తాయ‌ని స‌ర్వే ద్వారా తేలింద‌ని స‌మాచారం. ఈ ఉప ఎన్నిక‌లో మ‌రోసారి టీడీపీ అభ్య‌ర్థిగా ఉన్న ప‌న‌బాక లక్ష్మికి 3 ల‌క్ష‌ల‌కు మించి ఓట్లు రావ‌ని స‌ర్వేలో తేలిన‌ట్టుగా ప్ర‌చారం సాగుతోంది.

ఈ రిపోర్టు చూసిన చంద్ర‌బాబు ఆందోళ‌న‌కు గురైన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. చంద్ర‌బాబు, లోకేష్ ప్ర‌చారం ఏమాత్రం ప్ర‌‌భావం చూపించ‌ట్లేద‌ని, జ‌నాలు టీడీపీని విశ్వ‌సించ‌ట్లేద‌ని స‌ర్వే రిపోర్టులో పేర్కొన్న‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి, ఇందులో వాస్త‌వం ఎంత‌? ప్రజలు ఎవ‌రి వైపు చూస్తున్నారు? అన్న‌ది తేలాల్సి ఉంది.

Back to top button