టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

‘చైతు, నాని’లు తగ్గినా.. కుర్రాడు తగ్గడం లేదు !

‘చైతు – సాయి పల్లవి’ లాంటి క్రేజీ కలయికలో వస్తోన్న ‘లవ్ స్టోరీ’ని, అలాగే న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న ‘టక్ జగదీష్’ లాంటి భారీ అంచనాలు ఉన్న సినిమాలనే సైలెంట్ గా రిలీజ్ డేట్స్ నుండి తప్పించి.. మా సినిమాలు పోస్ట్ ఫోన్ అయ్యాయి అంటూ ఆయా సినిమాల మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలాంటాది ఒక చిన్న సినిమా హీరో మాత్రం తమ మూవీ రిలీజ్ డేట్ ను ముందుకు తీసుకువచ్చి.. సినిమాని రిలీజ్ చేస్తుండటం నిజంగా విశేషమే. అసలు అన్ని సినిమాలు వాయిదా పడుతున్నాయి. మరోపక్క కరోనా కేసులు కూడా సినిమా వాళ్ళల్లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.

అయినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కి తామూ భయపడేది లేదంటున్నాడు యంగ్ హీరో తేజ స‌జ్జా. ఆ మాటకొస్తే ఈ ఏడాది కరోనా ప్రవాహం కొనసాగుతున్న రోజుల్లోనే ‘జాంబీ రెడ్డి’ అంటూ థియేటర్స్ లోకి వచ్చి.. విజయం అందుకున్న ఈ కుర్రాడు, ఇప్పుడు ‘ఇష్క్’ అనే మరో చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతున్నాడు. పైగా అది థియేటర్స్ ద్వారా. మరి ఈ కుర్రాడి సినిమా కోసం జనం థియేటర్స్ వరకూ వెళ్తారా ?

అయితే ఈ సినిమా విషయంలో కాస్త అంచనాలు కనిపిస్తోన్న మరో అంశం ఏమిటంటే.. మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత కాలం విరామం త‌ర్వాత తేజ స‌జ్జాతో ఈ ‘ఇష్క్‌ చిత్రాన్ని నిర్మించింది. పైగా ఈ సినిమాలో సెన్సేషన్ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మొత్తానికి ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు మేకర్స్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేస్తూ సగర్వంగా ప్రకటించారు.

Back to top button