Top Storiesతెలంగాణరాజకీయాలుసంపాదకీయం

తెలంగాణ బడ్జెట్ రూ.2,30,825 కోట్లు.. ఏం రంగానికి ఎంత?

తెలంగాణ వార్షిక బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఉదయం 11.30 గంటలకు ఆయన బడ్జెటన్ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదనలను చదువుతున్నాడు. అంతకుముందు బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సారథ్యంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

గత ఏడాది కేవలం రూ.1.82 లక్షల కోట్లతో బడ్జెన్ ను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టగా.. ఈసారి మరింత పెరిగింది. రూ.2,30,825 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

రాష్ట్ర బడ్జెట్ రూ.2,30,825.96 కోట్లు కాగా… రెవెన్యూ వ్యయం రూ.,1,69,383.44 కోట్లుగా మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆర్థిక లోటు అంచ‌నా రూ. 45,509.60 కోట్లు కాగా.. పెట్టుబ‌డి వ్య‌యం రూ. 29.046.77 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లుగా చూపించారు.

Also Read: అర్థం కాని రాజగోపాల్‌ వైఖరి.. బీజేపీ స్వాగతిస్తుందా..?

– తెలంగాణ బడ్జెట్ లో కేటాయింపులు ఇవీ..
తొలిసారిగా రాష్ర్ట ప్ర‌భుత్వ బ‌డ్జెట్ నుంచి మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 500 కోట్ల నిధులు ఇస్తున్నట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌కు రూ. 29,271 కోట్లు ప‌ల్లెప్ర‌గ‌తి కింద ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామ‌పంచాయ‌తీల‌కు రూ. 5,761 కోట్ల నిధులు విడుద‌ల‌ చేశారు. ఇందులో జిల్లా ప‌రిష‌త్‌ల‌కు రూ. 252 కోట్లు, మండ‌ల పరిష‌త్‌ల‌కు రూ. 248 కోట్లు కేటాయింపు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌కు ఇచ్చే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధుల కోసం రూ. 5 కోట్లు కేటాయింపులు చేశారు. ఇక కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త స‌చివాల‌యం నిర్మాణానికి బడ్జెట్ లో ఏకంగా రూ. 610 కోట్లు కేటాయింపులు చేశారు.

పెద్ద పద్దులుగా రాష్ట్ర హోంశాఖ‌కు రూ. 6,465 కోట్లు కేటాయించారు. ఇక వైద్యారోగ్య శాఖ‌కు రూ. 6,295 కోట్లు, విద్యుత్ రంగానికి రూ. 11,046 కోట్లు, సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు కేటాయించారు. ఇక స‌మ‌గ్ర భూ స‌ర్వే కోసం రూ. 400 కోట్లు.. ఆస‌రా పెన్ష‌న్ల కోసం రూ. 11,728 కోట్లు.. క‌ల్యాణ‌ల‌క్ష్మి షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు రూ. 2,750 కోట్లు కేటాయించారు.

*ఇక శాఖల వారీగా కేటాయింపులు
-ఐటీ రంగానికి రూ. 360 కోట్లు
-సాంస్కృతిక ప‌ర్యాట‌క రంగాల‌కు రూ. 726 కోట్లు
-అట‌వీశాఖ‌కు రూ. 1,276 కోట్లు
-దేవాల‌యాల అభివృద్ధి, అర్చ‌కులు, దేవాదాయ ఉద్యోగుల సంక్షేమ కోసం రూ. 720 కోట్లు
-ప‌శు సంవ‌ర్ధ‌క‌, మ‌త్స్య‌శాఖ‌కు రూ. 1,730 కోట్లు
-పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ. 2,363 కోట్లు
-డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల కోసం గృహనిర్మాణ శాఖకు రూ. 11 వేల కోట్లు
-మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లు
-ఆర్టీసీకి రూ. 3000 కోట్లు(ఇందులో బ‌డ్జెటేత‌ర నిధులు రూ. 1500 కోట్లు)
-విద్యారంగ అభివృద్ధికి నూత‌న ప‌థ‌కం కోసం రూ. 4 వేల కోట్లు
-పాఠ‌శాల విద్య‌కు రూ. 11,735 కోట్లు
-ఉన్న‌త విద్యారంగానికి రూ. 1,873 కోట్లు

-బీసీల కోసం కేటాయింపులు ఇవీ
-బీసీ కార్పొరేష‌న్‌, అత్యంత వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల కార్పొరేష‌న్‌కు రూ. 1000 కోట్లు కేటాయింపులు. నేత‌న్న‌ల సంక్ష‌మం కోసం రూ. 338 కోట్లు మొత్తంగా బీసీ సంక్షేమ శాఖ‌కు రూ. 5,522 కోట్లు

*ఎస్సీ ఎస్టీల కోసం నిధులు
-వెయ్యి కోట్ల నిధుల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్.. ఎస్సీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు.. ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు

– మైనార్టీ సంక్షేమం కోసం నిధులు కేటాయించారు. మైనార్టీ సంక్షేమానికి రూ. 1,606 కోట్లు కేటాయించారు. మైనార్టీ గురుకులాల నిర్వ‌హ‌ణ‌కు రూ. 561 కోట్లు

-మ‌హిళా, శిశు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. షీ టాయిలెట్ల‌కు రూ. 10 కోట్లు.. -మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాల కోసం రూ. 3 వేల కోట్లు. మొత్తంగా మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,702 కోట్లు

Also Read: ‘నాగార్జున సాగర్ లో అభ్యర్థులెవరు? గెలుపు ఎవరిది?

-ప‌ట్ట‌ణాల అభివృద్ధి కోసం..
-హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధి కోసం నిధులు కేటాయింపు.ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం రూ. 250 కోట్లు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి రూ. 500 కోట్లు.. ప‌ట్ట‌ణాల్లో వైకుంఠ‌ధామాల నిర్మాణానికి రూ. 200 కోట్లు

*ప్రాజెక్టులకు ఇన్ని కోట్లు..
-సుంకిశాల వ‌ద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు.. మూసీ న‌ది పున‌రుజ్జీవం కోసం, సుంద‌రీక‌ర‌ణ కోసం రూ. 200 కోట్లు. -ఓఆర్ఆర్ ప‌రిధి లోప‌ల కొత్త‌గా ఏర్ప‌డిన కాల‌నీల తాగునీటి స‌ర‌ఫరా కోసం రూ. 250 కోట్లు

*కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా.. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కోట్లు కేటాయించారు. వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌కు రూ. 250 కోట్లు .. ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రూ. 150 కోట్లు. మొత్తంగా ఈ బ‌డ్జెట్‌లో పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధికి రూ. 15,030 కోట్లు కేటాయించడం విశేషం.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఇక ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖకు నిధులు భారీగానే వెచ్చించారు. ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 3,077 కోట్లు కేటాయించారు. ప‌రిశ్ర‌మ‌ల రాయితీ కోసం రూ. 2,500 కోట్లు బడ్జెట్ లో నిధులు ఇచ్చారు.

*ర‌హ‌దారులు, భ‌వ‌నాల నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. ఆర్వోబీ, ఆర్‌యూబీల‌కు రూ. 400 కోట్లు కేటాయించారు. ఆర్ అండ్ బీ రోడ్ల‌కు రూ. 800 కోట్లు.. పంచాయ‌తీరాజ్ రోడ్ల‌కు రూ. 300 కోట్లు.. స‌మీకృత క‌లెక్ట‌రేల్లు, జిల్లా పోలీసు కార్యాల‌యాలు, క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ల నిర్మాణానికి రూ. 725 కోట్లు.. మొత్తంగా రోడ్లు, భ‌వ‌నాల శాఖ‌కు రూ. 8,788 కోట్లు కేటాయించారు.

Back to top button