తెలంగాణరాజకీయాలు

ఇక నుండి రాజధాని ఎర్రవల్లి?

Cm kcr

కరోనా దెబ్బతో రాజధానిగా హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.. దింతో సీఎం కేసీఆర్… తను ఉన్న చోటి నుంచే పాలన సాగిస్తున్నారు. ఎర్ర‌వ‌ల్లి ఫామ్‌ హౌస్‌ లో ప్రత్యేక సెటప్ ఏర్పాటు చేశారు. పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ఏ అధికారితోనైనా మాట్లాడేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. అంతేకాదు… ఫామ్‌హౌస్‌లో చుట్టూ ప్రకృతి పచ్చదనం మధ్య… టెక్నాలజీతో సరికొత్త పాలనకు తెరతీశారు. ఫామ్‌ హౌస్ లోపల భారీ టీవీ ఏర్పాటు చేశారు. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టి… ఒకేసారి ఎక్కువ మంది అధికారులతో మాట్లాడేలా చేశారు. వారం నుంచి ఈ ఏర్పాట్లు సాగాయి. సోమవారం అవి పూర్తయ్యాయి.

సోమవారం ట్రయల్ నిర్వహించిన కేసీఆర్… సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొంత మంది కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. నెలాఖరువరకూ… ఎర్రవల్లి నుంచి పరిపాలన సాగిస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఇక ఏదైనా ఫామ్‌హౌస్ నుంచే.కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి వెళ్లడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుపడుతోంది. రాష్ట్రంలో కరోనా ఇంత తీవ్రంగా ఉంటే… సీఎం ఎర్రవల్లికి వెళ్లడమేంటని విమర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం… ఎక్కడ ఉంటే ఏముంది… పాలన నడుస్తోందా లేదా అన్నదే ముఖ్యం అనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై వారంలో ఐదురోజులు ఫామ్‌హౌస్‌లో, రెండు రోజులు… ప్రగతి భవన్‌ నుంచి పాలన సాగిస్తారని తెలిసింది.

గత కొన్ని రోజులుగా ఫామ్‌ హౌస్‌ లో ఉంటున్న కేసీఆర్‌ కి.. అధికారులు రోజూ ఉదయాన్నే తెలంగాణలో ఏం జరుగుతోందో సింపుల్‌ గా పాయింట్ల రూపంలో చెబుతున్నారు. అలాగే… ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా… కొన్ని విషయాలు చెబుతున్నారు. తద్వారా రోజూ ఏం జరుగుతుందో కేసీఆర్‌ కి తెలుస్తోంది. ప్రస్తుతానికి మంత్రులు, పార్టీ నేతలెవరూ ఫామ్‌ హౌస్‌ కి రావొదదని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

Tags
Show More
Back to top button
Close
Close