కరోనా వైరస్

కరోనా బాధితులకు శుభవార్త.. ఆదుకునే ఆస్పత్రులివే..?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా నిర్ధారణ అయిన వాళ్లలో తక్కువ లక్షణాలు ఉన్నవాళ్లు హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇంట్లో ప్రత్యేక గదులు లేని కుటుంబాలలో జీవనం సాగిస్తున్న వాళ్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం కరోనా బాధితుల కోసం ఏకంగా 4 ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ ఐసోలేషన్ కేంద్రాలలో వైద్యులు, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండటంతో పాటు బాధితులు త్వరగా కోలుకునేందుకు వీళ్లు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం కొండాపూర్ లోని ఏరియా ఆస్పత్రి, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, బేగం పేట్ నేచర్ క్యూర్ ఆస్పత్రి, ఎర్రగడ్డ బీ.ఆర్.కే,ఆర్ ఆయుర్వేద వైద్యశాలలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చింది.

ఇంట్లో ప్రత్యేక గదులు లేనివాళ్లు, స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నవాళ్లకు వైద్యసిబ్బంది ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. బాధితుల కోసం వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు కరోనా పాజిటివ్ రిపోర్ట్ ఉన్నవారిని ఆక్సిజన్ లెవెల్స్ పరిశీలించి చేర్చుకుంటారు. కరోనా బాధితులకు ఆస్పత్రి సిబ్బంది కరోనా నుంచి త్వరగా కోలుకునేలా ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాన్ని ఇస్తారు.

ఆరుబయట యోగా చేయించడంతో పాటు కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతారు. అవసరమైన వారికి ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక ఆహారాన్ని అందిస్తారు. కరోనా నిర్ధారణ అయిన వాళ్లు ఏ మాత్రం ఆందోళన చెందకుండా ప్రభుత్వం కరోనా బాధితుల కోసం మెరుగైన సౌకర్యాలను అందిస్తోంది.

Back to top button