ఆంధ్రప్రదేశ్రాజకీయాలుసినిమా

Btech student Murder: వాడిని నరికిన వాడితో పడుకుంటా: నటి సంచలనం

ఏపీలోని గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యశ్రీని హత్య చేసిన వాడిని నరికిన వాడితో పడుకుంటానని నటి రేఖ బోజ్ సంచలన ప్రకటన చేసింది.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక జులాయి అయిన శశికృష్ణ ప్రేమపేరుతో అమ్మాయిని నడిరోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తుండగా చేసిన హత్య వీడియో చూసి ఎవ్వరూ జీర్ణించుకోవడం లేదు. ముఖ్యంగా మహిళా లోకం ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తోంది. ఈ విషయంపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది మహిళలు స్పందిస్తున్నారు.

ఈ హత్యపై చలించిపోయిన తెలుగు నటి తాజాగా ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. హత్య చేసిన శశికృష్ణను నరికిన వాడితో నేను పడుకుంటాను అని ఫేస్ బుక్ వేదికగా నటి పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

నిందితుడు శశికృష్ణ ఇన్ స్టాగ్రామ్ ద్వారా రమ్యతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో శశికృష్ణ వేధించాడు. శశికృష్ణ వేధింపులతో రమ్య అతడిని దూరం పెట్టింది. దీంతో కొంత కాలం తనతో చనువుగా మాట్లాడిన రమ్య ఇప్పుడు పక్కనపెట్టడాన్ని శశికృష్ణ తట్టుకోలేకపోయాడు. ఆమెపై పగ పెంచుకున్న శశికృష్ణ అక్కడితో ఆగకుండా ప్రేమించకపోతే చంపుతానంటూ నిందితుడు నిత్యం బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎన్నిసార్లు చెప్పినా రమ్య ప్రేమ తిరస్కరించింది. దీంతో ఈ కోపంలోనే శశికృష్ణ హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు.

ఈ హత్య మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆ విజువల్స్ చూసిన వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. అంత మంది ఉన్నా కూడా ఆమెను కాపాడలేకపోయారని.. ఎవరో ఒకరు ఆపడానికి ప్రయత్నించి ఉంటే ఆమె చనిపోకుండా కనీసం బతికి ఉండేదని పోలీసులు అభిప్రాయపడ్డారు.

ఈ దారుణ ఘటన చూసి టాలీవుడ్ నటి, హీరోయిన్ రేఖ బోజ్ చలించిపోయింది. ఫేస్ బుక్ లో సంచలన పోస్ట్ పెట్టింది. ‘వాడిని కూడా అలానే ఎవరైనా నరికేస్తే ఆ నరికిన వాడితో పడుకుంటా.. నన్ను క్షమించండి. ఆ వీడియో చూసాక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. అంత నిస్సహాయలో మేం ఉన్నాం.. జిల్లాకు ఒక సజ్జనార్ సార్ కావాలి.. రమ్యా నీకు న్యాయం జరగాలి. రెస్ట్ ఇన్ పీస్ సిస్టర్’ అంటూ సోషల్ మీడియా రేఖ బోజ్ సంచలన పోస్టు చేసింది. ఇదిప్పుడు వైరల్ అవుతోంది.

ఏపీలోని విశాఖపట్నంకు చెందిన ఈ తెలుగు హీరోయిన్ పలు సినిమాల్లో నటించింది. అయితే అవి పెద్దగా ఆడకపోవడంతో పేరు రాలేదు. తెలుగులో ‘కలయా తస్మై నమ:’ అనే సినిమా 2016లో రిలీజ్ అయ్యింది. రంగీలా అనేసినిమా 2017లో రిలీజ్ అయ్యింది. ‘దామిని విల్లా, స్వాతి చినుకు సందె వేళలో, మహి, వైశాలి లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రమ్య హత్యపై ఫేస్ బుక్ పోస్టుతో మరోసారి వార్తల్లో నిలిచింది.

Back to top button