టాలీవుడ్సినిమా

పాపం మళ్ళీ బుక్కయ్యాడు.. అది తన జన్మ హక్కు !

thaman
కాపీ కొట్టడం అనేది తన జన్మ హక్కుగా పెట్టుకున్నట్లు ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ‘తమన్’. అసలు తెలుగు ఇండస్ట్రీలో కాపీ క్యాట్ అనగానే ముందుకు గుర్తుకొచ్చే పేరు తమన్. పాపం తమన్ ఎంతో కష్టపడి కాపీ కొట్టి ఒక పాటను రిలీజ్ చేస్తే.. వెంటనే దీని ఒరిజినల్ పాడండ్రా అంటూ ట్రోల్ మొదలు పెడుతుంటారు నెటిజన్లు. అందుకు తగ్గట్లుగానే తమన్ నుండి ఎలాంటి పాట వచ్చినా.. అది ఎక్కడో ఓ చోట నుంచి తమన్ కాపీ కొట్టినట్టు సాక్ష్యాలు దొరకడమే ఇక్కడ కొసమెరుపు. ఏది ఏమైనా పెద్ద హిట్ పాటలను కూడా, కాపీ కొట్టాడనే విమర్శలు అందుకున్న ఘనత మాత్రం తమన్ దే.

Also Read: ప్రభాస్ ‘ఆది పురుష్’లో స్టార్ హీరో కొత్త లుక్ !

అయితే తన పై వస్తోన్న విమర్శలకు తమన్ ఓ రేంజ్ లో ఆన్సర్ ఇస్తూ.. ‘కాపీ ట్యూన్స్ ప్లే చేస్తే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా ? ‘కాపీ కొడితే.. నాకింతింత‌ పారితోషికాలు ఇస్తారా’ ‘కాపీ కొడితే.. నాకన్ని సినిమాలు వ‌స్తాయా’ అంటూ లాజిక్కులు తీసి వివరణ ఇచ్చుకుంటుంటాడు తమన్. కాకపోతే త‌న‌పై కాపీ ముద్ర ప‌డిన‌ప్పుడ‌ల్లా త‌మ‌న్ లాజిక్స్ ఇలాగే ఉంటాయి. కానీ ఆ తర్వాత పాట మాత్రం, కాపీ ట్యూన్ తోనే వస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వస్తోన్న తంతంగమే ఇది. అయినా తమన్ మాత్రం కాపీ చేసినట్టు ఒప్పుకోడు.

పైగా ‘వాళ్లకి అంత దమ్ముంటే. వచ్చి కొత్తగా ఓ పాట క్రియేట్‌ చేసి చూపించమనండి’ అంటూ ఎదురు మండిపడుతుంటాడు. ఎవడు పడితే వాడు వచ్చి కాపీ కొట్టాడంటే ఇక్కడ ఎవడూ వినేవాడు లేడు అంటూ ఫైర్ అవుతుంటాడు. రెండ్రోజుల క్రిత‌మే మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ తమన్ స్పందించిన రియాక్షన్స్ ఇవి. అయితే త‌మ‌న్‌ తనను తానూ స‌మ‌ర్థించుకున్న 48 గంట‌లు గ‌డ‌వక ముందే.. త‌న‌పై మ‌రిన్ని విమ‌ర్శ‌లూ, ట్రోల్సూ మొద‌లైపోవడమే మరీ కామెడీగా ఉంది.

Also Read: స్టార్ వారసుడి చిరకాల కోరిక తీరుతుందా ?

క్రాక్ సినిమా కోసం తమన్ ‘మాస్ బిరియానీ’ అనే బీట్ ఒకటి కొట్టాడు. కానీ, ఈ పాటతో త‌మ‌న్ పై మ‌రోసారి కాపీ ముద్ర పడింది‌. ఈ పాట గ‌తంలో తాను తీసిన బ‌లుపులోని విన‌వే కన్యా కుమారి.. పాట‌కు డిటో అన్న‌ది జ‌నాలు గ్ర‌హించేసి మనోడిని ఓ ఆట ఆడుకుంటున్నారు. నిజానికి ఆ సినిమాకి కూడా త‌మ‌నే సంగీత ద‌ర్శ‌కుడు. మొత్తంగా త‌న పాట‌ను తానే కాపీ కొట్టుకుంటూ ఇలా బుక్ అవుతున్నాడు తమన్, పాపం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button