సినిమాసినిమా వార్తలు

అల్లు అర్జున్ కు ‘ఐకాన్ స్టార్’ అందుకే పెట్టారట!

That's why Allu Arjun is called 'Icon Star'!

‘స్టైలిష్ స్టార్’ నుంచి అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. దర్శకుడు సుకుమార్ బన్నీకి ‘ఐకాన్ స్టార్’ అనే బిరుదును ఇచ్చాడు. ఐకాన్ స్టార్ అనే పదం ఎందుకు వచ్చిందో తాజాగా బయటకు వచ్చింది.

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ‘ఐకాన్’ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తీయబోతున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రకటించారు. కానీ సెట్స్ పైకి వెళ్లలేదు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ స్ట్రిప్ట్ కు మెరుగులు దిద్దుతున్నాడు.

చిత్రం టైటిల్ ను ‘ఐకాన్’ అని దానికి ‘కనబడుట లేదు’ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ చిత్రం కథపై ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చిందట.. ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘అంధుడి’గా ప్రయోగాత్మక చిత్రంలో నటించబోతున్నారని.. అందుకే ఆ ట్యాగ్ లైన్ పెట్టారని అంటున్నారు.

అల్లు అర్జున్ కూడా అంధుడిగా భారీ ప్రయోగానికే రెడీ అవుతున్నారని.. ఈ చిత్రంతోనే ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందబోతున్నాడని అంటున్నారు. ఈ చిత్రం నుంచే సుకుమార్ ముందుగా ఐకాన్ స్టార్ ఇచ్చేశాడని చెబుతున్నారు.

Back to top button