బాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఆ నిర్మాత నా నగ్న ఫొటోలు రిలీజ్ చేశాడన్న నటి

The actress alleges that the producer released my nude photos

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పై మరో కేసు దాఖలైంది. అతడిపై ఓ సీరియస్ ఆరోపణ చేస్తూ మరో నటి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అనుమతి తీసుకోకుండానే తన అశ్లీల చిత్రాలను హాట్ షాట్స్ యాప్ లో రాజ్ కుంద్రా విడుదల చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ముంబై పోలీసులు ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారని పలు వార్తా కథనాలు బయటకు వచ్చాయి.

ఇప్పటికే అశ్లీల వీడియోలు తీస్తున్నాడని అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాపై తాజాగా ఈ నటి తీవ్ర ఆరోపణలు చేసినట్లు సమాచారం. మల్వాణీ పోలీస్ స్టేషన్ లో కుంద్రాపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె స్టేట్ మెంట్ ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు రికార్డ్ చేశారు.

రాజ్ కుంద్రా మంచి వాడుకాదని.. తనకు ఇచ్చిన మాట తప్పాదని ఆమె ఆరోపించారు. ప్రైవేటు పార్ట్స్ ను వీడియోలో చూపించకూడదు అనే షరతుతో రాజ్ కుంద్రా నిర్మించిన ఈ అశ్లీల చిత్రంలో తాను నటించానని.. అందుకుగాను కుంద్రా తనకు కొత్త మొత్తాన్ని ఇచ్చాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

తన నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఏవిధమైన మార్పులు చేయకుండా పూర్తి వీడియోను హాట్ షాట్ యాప్ లో విడుదల చేశాడని.. ఓ స్నేహితుడి ద్వారా తనకు ఈ విషయం తెలిసి ఫిర్యాదు చేసినట్టు ఆమె వివరించింది.

ఇప్పటికే అశ్లీల వీడియోలు తీస్తున్నాడని రాజ్ కుంద్రాను జూలై 19న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరో నటిని కూడా మోసం చేసి ఆమె ఆశ్లీల వీడియోలు తీశాడని కేసు నమోదు కావడంతో మరింతగా రాజ్ కుంద్రా ఇరకాటంలో పడినటైంది.

Back to top button