ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్జాతీయంప్రత్యేకంబ్రేకింగ్ న్యూస్రాజకీయాలు

బీజేపీ ప్రేమ:రజినీకాంత్ కు కేంద్రం విశిష్టగౌరవం

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటన

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈసారి తమిళనాడు ఎన్నికల బరిలో నిలవకుండా అనారోగ్యం కారణంగా చూపి తప్పుకున్నారు. దాంతో తమిళనాట అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి కాస్త ఉపశమనం లభించింది. రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడంతో అక్కడి అన్ని పక్షాలు ఊపిరి పీల్చుకున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో లబ్ధి పొందాలనే.. ‘రజినీకాంత్’ అభిమానులు అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి ఓట్లు వేయాలనే ఆయనకు దేశ అత్యున్నత పరుస్కారం ప్రకటించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ప్రకటన రావడంతో అందరూ దీనివెనుక బీజేపీ ఎత్తుగడ ఉందని విమర్శిస్తున్నారు. అందుకోసమే కేంద్రప్రభుత్వం కూడా రజినీకాంత్ కు దేశంలోనే సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును ప్రకటించింది.

ఇటీవలే బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ను ఈ పురస్కారం వరించింది. అలాగే దక్షిణాదికి చెందిన బొమ్మరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్ (తెలుగు) , నాగిరెడ్డి (తెలుగు) , అక్కినేని నాగేశ్వరరావు (తెలుగు), శివాజీ గణేషన్ (తమిళం, రాజ్ కుమార్ (కన్నడ), గోపాలకృష్ణన్ (మలయాళం), రామానాయుడు (తెలుగు), బాలచందర్ (తెలుగు, తమిళం) కేవిశ్వనాథ్ (తెలుగు) ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

దక్షిణాది అగ్ర నటుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ కు కేంద్రం ఈ పురస్కారం ప్రకటించింది. .గురువారం ఉదయం రజినీకి  51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు  ఇస్తున్నట్లు  కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటిస్తోంది.

Back to top button