అత్యంత ప్రజాదరణజాతీయంరాజకీయాలుసంపాదకీయం

ఇందిరా గాంధీ మరణం వెనుక అంతుచిక్కని రహస్యాలు

The elusive secrets behind the death of Indira Gandhi

రాహుల్ గాంధీ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నానమ్మ, నాన్నలను తమిళ మూలాలు గల వ్యక్తులు చంపడంపై ఆవేదన చెందారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇందిరాగాంధీ మరణం వెనుక రహస్యాలపై చర్చ జరుగుతోంది. నాటి విశేషాలపై స్పెషల్ ఫోకస్

భారతదేశ మొదటి.. ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఉక్కు మనిషిగా పిలిచే ఈమె పాలన కాలం ప్రత్యేకమైనది. అయితే ఇందిరాగాంధీ మరణంపై ఇప్పటికీ రకరకాల కథనాలు ఉన్నాయి. ఏదీ ఏమైనా ఆమె బాడీగార్డులు గన్ తో కాలిస్తేనే హతమైందన్నది వాస్తవం. అయితే వాళ్లు ఇందిరను చంపడానికి కారణమేంటి..? ఎందుకు ఇందిరను చంపాల్సి వచ్చింది..? అనేది ఇంకా మిస్టరీగానే ఉంది..? ఇందిరాగాంధిని హత్య చేసినందుకు వారికి అప్పటి ప్రభుత్వం శిక్షలు వేసింది..? కానీ ఒక ప్రధానమంత్రికి భద్రత కల్పించే వీరు ఆ నిర్ణయం తీసుకోవడంపై అనేక రకాల కారణాలున్నాయి. వాటిలో కొన్ని..

1984 అక్టోబర్ 31. ఈరోజు చరిత్రలో నిలిచిన రోజు. భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాందీ చంపబడ్డ రోజు. ఇందిరాగాంధీని తన దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డులు ఇందిరను కాల్చిన దురదృష్టకరమైన రోజు. సిక్కులను వారి మతాలన్నా,వారి సాంప్రదాయాలన్నా ప్రాణం ఇస్తారు. వాటి కోసం ఏమైనా చేయడానికి సిద్ధమవుతారు. ఇప్పుడు ఇదే నమ్మకం ఇందిరాగాంధీ ప్రాణం తీసిందని కొందరు చర్చించుకుంటున్నారు. ఇందిరాగాంధీకి అత్యంత భద్రతా కల్పించే సిబ్బంది ఇద్దరు ఉండేవారు. వారు బీన్త్ సింగ్, సత్వంత్ సింగ్..

బీన్త సింగ్..1959 జనవరి 20న చంఢీఘర్లోని మలోయా గ్రామంలో జన్మించాడు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న వీరి గ్రామంపై దేశభక్తి ప్రభావం అధికంగా ఉండేది. బీన్త్ సింగ్ పేదరికంలో పుట్టినా కష్టపడి చదువుకున్నాడు. అయితే కొంచెం కోపిష్టి. దూకుడుగా ఉంటాడు. ధైర్యంగా, ఉన్నత చదువులు చదివిన ఈయనను ప్రధాని సెక్యూరిటీగా నియమించారు ఉన్నతాధికారులు. అంతకుముందు ఆయన బ్యాక్ రౌండ్ అంతా చెక్ చేసి క్లీన్ చీట్ ఇచ్చారు.

సత్వన్ సింగ్..పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లా అగ్వాన్ గ్రామంలో జన్మించాడు. 1962 జనవరి 6న ఆయన జన్మదిన రోజు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈయనకు ధైర్యం ఎక్కువే. చురుకుదనం కూడా ఉండడంతో ఇందిరాగాంధీకి బాడీగార్డుగా నియమించారు.

అయితే ఇందిరను హత్య చేయడానికి ప్రధాన కారణం గోల్డెన్ టెంపుల్ పై బ్లూస్టర్ ఆపరేషన్. ఈ ఆలయంలోకి ప్రధాని బూట్లతో వెళ్లడం, మారణహోమం సృష్టించడం తదితర కారణాపలై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బీన్త్ సింగ్ కూడా బ్లూస్టార్ విషయంలో ఇందిరపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని తోటి బాడీగార్డు సత్వన్ సింగ్ దగ్గర వివరించాడు.

మన దేవుడిని ఇందిర అవమానించారని, దానికోసమైనా ఇందిరపై పగ తీర్చుకోవాలంటూ సత్వన్ సింగ్ కు బీన్త్ సింగ్ పదే పదే చెప్పేవాడు. అయితే మొదట్లో సత్వన్ సింగ్ ఒప్పుకోలేదు. కానీ ఆ తరువాత సత్వన్ సింగ్ కూడా ఇందిరపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే సత్వన్ సింగ్ పై బీన్త్ సింగ్ కు నమ్మకం కలుగలేదు. దీంతో బీన్త్ సింగ్, సత్వన్ సింగ్ తో మాట్లాడుతూ.. నేను ‘మొదట ఇందిరను కాలుస్తాను.. ఆ తరువాత నువ్వు కాల్చాలి. లేకుంటే నేను నిన్ను కాలుస్తాను’అని వార్నింగ్ ఇచ్చాడు.

అది 1984 అక్టోబర్ 31వ రోజు. ఇందిర ఆరోపు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదు. ఈ విషయాన్ని బీన్త్ సింగ్, సత్వన్ సింగ్ కు తెలిపాడు. ఆరోజు ఇందిర ఇంటిలో నుంచి గేటు దాటగానే బీన్త్ సింగ్ రివాల్వర్ తో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆ తరువాత సత్వన్ సింగ్ ను కాల్చమని ఆదేశించాడు. అప్పటికే చేతిలో మిషన్ గన్ తో ఉన్న సత్వన్ సింగ్ ఇందిర పొట్టపై 20 రౌండ్ల వరకు కాల్చాడు. దీంతో ఇందిర కుప్పకూలింది. అయితే బీన్త్ సింగ్, సత్వన్ సింగ్ లు గన్లు కింద పడేసి లొంగిపోయారు.

దీంతో ఇందిర వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కె.దావన్ మరో వ్యక్తి ఇందిరను ఆసుపత్రికి తరలించారు. బీన్త్ సింగ్, సత్వన్ సింగ్ లను ఐడీబీపీ గార్డులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సమయంలో బీన్త్ సింగ్ పారిపోవడానికి ప్రయత్నించడంతో అక్కడున్న పోలీసులు అతన్ని కాల్చి చంపేశారు. సత్వన్ సింగ్ మాత్రం కామ్ గానే ఉన్నాడు. అతడిని ఎర్రకోటలోని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి విచారణ చేపట్టారు. చట్ట ప్రకారం ఐదేళ్లు విచారణ జరిపి ఉరిశిక్ష విధించారు. అయితే తాను చనిపోయే ముందు కొన్ని వాఖ్యలు చేశాడు. తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని అయితే సిక్కులు శాంతంగా ఉండాలని సూచించారు.

Back to top button