సినిమాసినిమా వార్తలు

స్టార్ హీరోకు షాకిచ్చిన హైకోర్టు

The High Court shocked the star hero

రజినీకాంత్ అల్లుడు.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. లగ్జరీ కారు కొనుగోలు విషయంలో పన్ను కట్టి తీరాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. ‘సామాన్య ప్రజలే పన్ను కడుతున్నప్పుడు వీఐపీలకు ఇబ్బంది ఏమిటీ అంటూ ప్రశ్నించింది.చట్టం ముందు అందరూ సమానులేనని ధనుష్ కు హైకోర్టు షాకిచ్చింది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అత్యంత ఖరీదైన ‘రోల్స్ రాయిస్’ కారును కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దానిని దిగుమతి చేసుకున్నందుకు గాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన అదే ఏడాది మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ధనుష్ వేసిన పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

స్టార్ హీరో అయ్యిండి.. కోట్లు సంపాదిస్తూ.. లగ్జరీ కారు కొనుగోలు చేసి పన్ను మినహాయింపు ఎలా అడుగుతున్నారని ధనుష్ ను హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే తాను 50 శాతం పన్ను చెల్లించానని మిగిలిన మొత్తాన్ని ఆగస్టు 9న కట్టేస్తానని ధనుష్ సమాధానమిచ్చాడు.

హీరో విజయ్ సైతం ఇటీవల ఖరీదైన కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు కూడా కోర్టులో ఇలాంటి అనుభవం ఎదురైంది. ఇక ఆయనకు లక్ష రూపాయల జరిమానాను కూడా కోర్టు విధించి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ధనుష్ కు కూడా అదే అనుభవం ఎదురైంది.

Back to top button