అత్యంత ప్రజాదరణవైరల్సినిమా

20 ఏళ్ల కిందట.. రాజమౌళి ‘బాహుబలి’ కథ సీక్రెట్ తెలిసింది

Rajeev Kanakala Rajamouli

టాలీవుడ్ లోనే కాదు.. దేశంలో.. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి ఒక క్రెడిట్ తెచ్చిపెట్టింది ‘బాహుబలి’ చిత్రం. అయితే ఆ చిత్రాన్ని రాజమౌళి ఒక శిల్పాన్ని చెక్కినట్టు చెక్కాడు. అందుకే అంత అద్భుతంగా వచ్చింది. ఇప్పటికీ అదొక ట్రెండ్ సెట్టర్. అయితే ‘బాహుబలి’ చిత్రం గురించి మరో సంచలన విషయాన్ని బయటపెట్టాడు రాజీవ్ కనకాల. రాజమౌళికి చాలా ఆప్తుడు, స్నేహితుడైన రాజీవ్ ఈ సందర్భంగా ఆ చిత్రం కథ గురించి సీక్రెట్ బయటపెట్టాడు.

Also Read: బిగ్ బాస్-4: గంగవ్వ నిజమైన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

రాజమౌళి తొలి చిత్రం ‘స్టూడెంట్ నంబర్ 1’. ఈ చిత్రంలో విలన్ గా రాజీవ్ కనకాలనే నటించాడు. అంతకుముందే వీరిద్దరికి పరిచయం అంట.. అందుకే రాజమౌళి ప్రతి సినిమాలోనూ రాజీవ్ కనకాల ఉంటాడు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోనూ రాజీవ్ చాలా కీలకపాత్ర పోషిస్తున్నాడట.. ఇదే విషయాన్ని రాజీవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తన పాత్ర చాలా చాలా కీలకమంటున్న రాజీవ్.. క్యారెక్టర్ డీటెయిల్స్ చెప్పడానికి మాత్రం నిరాకరించాడు.

Also Read: బాలీవుడ్ పై ‘బన్ని’ కన్ను.. ప్లాన్ అదుర్స్?

రాజమౌళి సీరియల్స్ చేస్తున్నప్పటి నుంచే రాజీవ్ కనకాలతో పరిచయం ఉందట.. ఇద్దరూ సాయంత్రం స్టోరీ చర్చలు చేసుకునే వారట.. ఆ తర్వాత రాజమౌళి దర్శకుడు అయ్యాక స్టూడెంట్ నంబర్ 1 చిత్రం టైంలోనే బాహుబలి కథను తనకు చెప్పాడని.. కొన్ని ఫైట్ సీక్వెన్సులు, హీరో ఎలివేషన్ గురించి కొన్ని అప్పుడే రాజమౌళి రాసి పెట్టుకున్నాడని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. అప్పుడు తనకు చెప్పినట్టే బాహుబలిలో చూపించాడని.. రాజమౌళి ఒక గొప్ప విజినరీ అని పేర్కొన్నాడు.  20 ఏళ్ల కిందటే రాజమౌళి బాహుబలి కథను రెడీ చేశాడని.. దాన్ని ఇప్పటికీ నెరవేర్చుకున్నాడన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చిందన్న మాట..

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button