తెలంగాణరాజకీయాలు

హైదరాబాదీలు.. తస్మాత్‌ జాగ్రత్త

There is a threat of diseases with rains

మహానగరాన్ని మరోసారి వరదలు ముంచెత్తాయి. వరదల తగ్గి నాలుగు రోజులు అవుతున్నా ఇంకా పలు కాలనీలు మాత్రం నీళ్లలోనే ఉండిపోయాయి. ఇంకొన్ని కాలనీల్లో బురదతో నిండిపోయాయి. మరోవైపు ప్రజలు కలుషిత ఆహారం తీసుకుంటున్నారు. కలుషిత నీరు తాగుతున్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Also Read: బ్రేకింగ్: కంగనా రనౌత్ పై దేశద్రోహం కేసు

భారీ వరదల నుంచి మహానగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నాలుగు రోజులుగా వర్షం ఆగిపోయాని.. దాని ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. జీవనోపాధి కోసం భాగ్యనగరానికి వచ్చిన అభాగ్యులను వరదలు నిండా ముంచాయి. ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు మొదలు.. కట్టుకునే బట్టల వరకు అన్ని నీటిలోనే కొట్టుకుపోయాయి.

ఇప్పటికే తిండి, నీటి కోసం అల్లాడుతున్న ప్రజలకు మరోవైపు అంటువ్యాధుల భయం నెలకొంది. ఇందులోభాగంగా ఇప్పటికే ఆయా కాలనీల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్‌‌ వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అంటు వ్యాధుల ముప్పు రాకుండా ఉండడానికి 60 హెల్త్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. మురుగు నీటిలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయడానికి అప్రమత్తం చేశారు.

Also Read: 900 టీఎంసీల నీరు వృథా.. ఇదీ మన వ్యథ!

ఇప్పటికే చాలా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది తమ తమ విధుల్లో నిమగ్నమయ్యారు. వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. కాచి చల్లార్చిన నీరు తాగాలని, దోమలు వ్యాప్తి చెందకుండా నివారించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. వరదలు తగ్గినప్పటికీ వ్యాధులు పోయాయని అనుకోవద్దని, అప్రమత్తత చాలా అవసరమని అంటున్నారు. ప్రభుత్వం కూడా మరోవైపు సీరియస్‌గా తీసుకొని ఆయా కాలనీల ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు.. వారి హెల్త్‌ విషయంలోనూ ఒక అడుగు ముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.

Back to top button