ఆరోగ్యం/జీవనంజాతీయం - అంతర్జాతీయం

కరోనా వ్యాక్సిన్ తీసుకునే వారికి అలర్ట్.. ఆప్షన్ లేదట..?


దేశంలోని ప్రజలు కరోనా మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలకు వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుండగా ప్రాధాన్యత ఆధారంగా కేంద్రం వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుంది. తొలి దశలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం.

దేశంలో తొలి దశలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల పంపిణీ జరగనుంది. అయితే కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం ఆప్షన్ ఇవ్వదని కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన్ నే ప్రజలు తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఐతే ఎటువంటి ఆప్షన్ ఇవ్వడం లేదని కేంద్రం వెల్లడించగా భవిష్యత్తులో మాత్రం ఆప్షన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు వారాల వ్యవధిలో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వ్యాక్సిన్ తీసుకున్న రెండు నెలల తరువాతే వాటి ప్రభావం ప్రారంభమవుతుంది. సీరం సీఈవో అదర్ పూనావాలా మన దేశంలో తయారైన వ్యాకిన్లన్నీ సమర్థవంతంగా పని చేస్తున్నాయని వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన అన్నారు. ఇప్పటికే కోవిషీల్డ్ వ్యాక్సిన్ల పంపిణీ జరగగా కోవాగ్జిన్ వ్యాకిన్ రవాణా ప్రక్రియ ప్రారంభమైంది.

ప్రజలు రెండు వ్యాక్సిన్ ను తీసుకున్న 28 రోజుల వరకు తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్ తీసుకున్న 14 రోజుల తరువాత రెండో డోస్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటంతో త్వరలోనే కరోనాకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Back to top button