క్రీడలు

T20 WordlCup 2021: టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే!

. టీ20 ప్రపంచకప్ లో భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు సెమీస్ చేరుతాయని భావిస్తున్నట్టు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సమాధానమిచ్చారు.

T20 WordlCupP:టీ20 వరల్డ్ కప్ కు వేళైంది. అన్ని దేశాలు ఈ ప్రపంచకప్ సాధించేందుకు అప్పుడే ప్రణాళికలు మొదలుపెట్టాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇప్పటికే వివిధ జట్లు తమ టీంలను ప్రకటించాయి. పంచ్ హిట్టర్లందరినీ జట్టులోకి తీసుకున్నాయి.

ఈ క్రమంలోనే ఏ టీం బలంగా ఉంది.? ఏ నాలుగు టీంలు సెమీస్ కు చేరుతాయన్న దానిపై చర్చ మొదలైంది. మాజీ క్రికెటర్లందరూ దీనిపై విశ్లేషణలు మొదలుపెట్టారు.

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సైతం ఈ టీ20 వరల్డ్ కప్ పై అంచనాలు విడుదల చేశారు. ఆ నాలుగు జట్లు సెమీస్ కు వెళుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ స్పోర్ట్స్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతం గంభీర్ ఈ మెగా టోర్నీలో విజయావకాశాలపై మాట్లాడారు.

ఈ టీ20 ప్రపంచకప్ లో ఏయే జట్లు సెమీస్ చేరుతాయనే ప్రశ్నకు గౌతం గంభీర్ ఆసక్తిగా బదులిచ్చాడు. టీ20 ప్రపంచకప్ లో భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు సెమీస్ చేరుతాయని భావిస్తున్నట్టు సమాధానమిచ్చారు.

ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ ను భారత్ ఒక్కసారి మాత్రమే గెలిచిందని.. 2007 ఆరంభ ఎడిషన్ లో ఎంఎస్ ధోని సారథ్యంలో పాకిస్తాన్ పై 5 పరుగుల తేడాతో గెలిచి మొదటి కప్ సొంతం చేసుకొని విజేతగా నిలిచింది. ఆ టోర్నీ గౌతం గంభీర్ సైతం ఉన్నాడు.

ఇక ఈసారి ఆస్ట్రేలియా జట్టు బలంగా ఉందని.. ఆ జట్టే కప్ కొడుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. అయితే గంభీర్ మాత్రం ఆస్ట్రేలియాను సెమీస్ జట్లలో చేరే జట్టుగా లేదని తేల్చడం విశేషం.

కాగా ఇప్పటికే టీ20 కప్ లను వెస్టిండీస్ రెండు సార్లు 2012,2016లో గెలుచుకుంది. 2010లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ చాంపియన్ గా నిలిచింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ ను సాధించలేదు. ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి రేపుతోంది.

Back to top button