ఆరోగ్యం/జీవనంజనరల్

ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?

Medicines

దేశంలో చాలామంది చిన్న ఆరోగ్య సమస్య నుంచి పెద్దపెద్ద ఆరోగ్య సమస్యల చికిత్స కొరకు ట్యాబ్లెట్లను వినియోగిస్తున్నారు. అయితే ఔషధాల విషయంలో కొన్ని చిన్నచిన్న తప్పులు చేస్తూ ఉంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఔషధాలను వినియోగించినా ఆ ఔషధాలు శరీరంపై ప్రభావవంతంగా పని చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చాలామంది ఔషధాలు, సిరప్ లను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు.

Also Read: గర్భంతో ఉన్న సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

అలా చేయడం వల్ల ఔషధం పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఔషధాలను ఎక్కడ పడితే అక్కడ నిల్వ చేస్తే కొన్ని సందర్భాల్లో శరీరంపై దుష్ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. ఔషధాలను కొనుగోలు చేసినప్పటి నుంచి వినియోగించే వరకు తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. సిరప్ లను తెరిచి పెడితే వాటిలోకి ఫంగస్ చేరే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా కొత్త ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి.

Also Read: అలసట, నీరసం తగ్గాలంటే పాటించాల్సిన చిట్కాలివే..?

డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు ఇన్సులిన్ ను నిర్ణీత ఉష్ణోగ్రత దగ్గర భద్రపరచకపోయినా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. మరికొన్ని సార్లు వైద్యులను సంప్రదించకుండా వ్యాధి లక్షణాలను బట్టి మందులను తీసుకుంటూ ఉంటాం. మెడికల్ షాపులలో ఇచ్చే ఔషధాలు డాక్టర్ సూచించిన ఔషధాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. మందులను అధిక ఉష్ణోగ్రత దగ్గర ఉంచితే మందులు పనిచేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ఇంట్లో ఫ్రిజ్ లేని వారు ఇన్సులిన్ ను భద్రపరచాలంటే మట్టికుండలో నీళ్లపోసి భద్రపరచవచ్చు. సిరప్ మూతను తప్పనిసరిగా మూసివేయడంతో పాటు సూచించిన మోతాదు మేరకే మందులను వాడాలి. ఔషధాలపై ఎక్స్ పైరీ డేట్ ను చూసుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకొని భద్రపరచుకోవాలి

Back to top button