జనరల్ప్రత్యేకం

మరణించే కొద్దిరోజుల ముందు మనలో ఈ లక్షణాలు కనిపిస్తాయి..!

Pre Death Signs

భూమిపై పుట్టిన ప్రతి ఒక్క జీవికి మరణం తప్పదు. మరణించిన ప్రతి ఒక్కరు తిరిగి జన్మిస్తారు. ఈ విధంగా జనన, మరణాలు ఈ కాల చక్రంలో తిరుగుతూ ఉంటాయి. సాధారణంగా మనం పుట్టినప్పుడు మన శరీరంలోకి మనతో పాటు ఆత్మ కూడా వస్తుంది.ఆత్మ మన శరీరం నుంచి ఎప్పుడైతే వెళ్లిపోతుందో అప్పుడు మనకు మరణం సంభవిస్తుంది.అయితే ఈ మరణం అనేది రెండు రకాలుగా సంభవిస్తుంది.ఒకటి సహజ మరణం. ఈ మరణం ఏవైనా అనారోగ్య కారణాల వల్ల లేదా వృద్ధాప్యం వల్ల ఏర్పడే మరణం. అసహజమైన మరణాలు కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవడం, హత్య చేయబడటం, లేదా ఏవైనా ప్రమాదాలు జరిగేటప్పుడు సంభవించే మరణం.

Also Read: ఏపీలోని ఆ జిల్లాలో వింత ఘటన.. ముల్లంగిలో దర్శనమిచ్చిన గణపతి ఆకారం..!

పురాణాల ప్రకారం సహజమైన మరణం వచ్చినప్పుడు మనలో కొన్ని లక్షణాలు ముందుగానే కనిపిస్తాయని తెలుస్తోంది. అయితే ఆ లక్షణాలు ఏమిటంటే…చనిపోయే కొద్ది రోజుల ముందు నుంచి మన శరీరం తెలుపు రంగులో లేదా పసుపు రంగులోకి మారుతుంది. కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి. ఈ విధంగా మనిషి రంగులో మార్పులు జరగటం వల్ల మరణం సంభవిస్తుందని భావిస్తారు.

Also Read: నష్ట పోయిన ధనం తిరిగి రావాలంటే శివుడికి ఈ నీటితో అభిషేకం చేయాల్సిందే..!

మనిషి జన్మించే టప్పుడు వారితోపాటు నీడ కూడా పుడుతుంది. వారు చనిపోయేటప్పుడు అదే నీడ ఆత్మ రూపంలో వెళ్లిపోతుంది.కానీ మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో పాటు మన నీడ లేకపోతే మనకి మరణం దగ్గరలో ఉందని చెప్పవచ్చు. మనిషి ప్రతిబింబం అద్దం, నీటిలో, నూనెలో కనిపించినప్పుడు అది మన మరణానికి సంకేతం అని తెలియజేస్తుంది. ఈ విధంగా సహజ మరణం పొందిన వారి ఆత్మ పరమాత్మ సన్నిధి లో ఐక్యమవుతుంది.కానీ ప్రమాదాల వల్ల మరణించిన వారి ఆత్మ దైవ సన్నిధికి చేరలేక భూలోకంలో రాలేక, వారికి తీరని ఆంక్షలు ఉండటం వల్ల కొట్టుమిట్టాడుతోంది. అందుకోసమే అసహజ మరణం పొందిన వారికి తర్పణ కార్యక్రమాలు చేయడం ద్వారా వారి ఆత్మశాంతి ఇస్తుందని పండితులు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

Back to top button