ప్రత్యేకంవిద్య / ఉద్యోగాలు

లక్షల రూపాయల వేతనం ఇచ్చే టాప్ 5 ఉద్యోగాలు ఇవే..?


మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో సక్సెస్ సాధించాలని ఉంటుంది. లక్షల రూపాయల వేతనం సొంతం చేసుకుంటే మనం కన్న కలలను నిజం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే కెరీర్ విషయంలో సరైన రీతిలో అడుగులు వేస్తారో వాళ్లు సులువుగా లక్షల రూపాయల వేతనాన్ని అందుకోగలుగుతారు. ఒక ప్రముఖ సంస్థ రెండు నెలల క్రితం చేసిన సర్వే ద్వారా దేశంలో ఎక్కువ వేతనం పొందే ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.

లక్షల రూపాయలు వేతనం పొందే ఉద్యోగాలలో బ్లాక్ చెయిన్ డెవలపర్ల ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో విరివిగా అవకాశాలతో పాటు లక్షల్లో వేతనాలు కూడా లభిస్తున్నాయి. టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగాల్లో చేరి లక్షల్లో వేతనం సొంతం చేసుకోవచ్చు. బ్లాక్ చెయిన్ అప్లికేషన్లు, టెక్నాలజీపై టెస్టింగ్ చేయడంపై అవగాహన ఉంటే ఈ ఉద్యోగంలో చేరవచ్చు.

ఈ మధ్య కాలంలో డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఐటీ, టెలికం, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రిటైల్ రంగాల్లో డేటా సైంటిస్ట్ లకు ఎక్కువ డిమాండ్ ఉంది. వీళ్లకు సంవత్సరానికి 14 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయల ప్యాకేజీ లభిస్తోంది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఉద్యోగాల్లో ఛార్టెడ్ అకౌంటెంట్ ఉద్యోగం కూడా ఒకటి. వీళ్లు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గా పని చేస్తారు.

ప్రస్తుతం దేశంలో మెడికల్ ప్రొఫెషనల్స్ కు కూడా మంచి డిమాండ్ ఉంది. అత్యధిక వేతనం చెల్లించే ఉద్యోగాల్లో మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా ఒకటి. కరోనా విజృంభణ తరువాత వీళ్లకు డిమాండ్ మరింత పెరిగింది. దేశంలో ప్రస్తుతం ఇన్వెస్ట్ మెంట్స్ బ్యాంకర్స్ ఉద్యోగాలకు సైతం మంచి డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగంలో ఫ్రెషర్స్ కు సైతం లక్షల్లో వేతనం లభిస్తోంది.

Back to top button