అత్యంత ప్రజాదరణటాలీవుడ్సినిమాసినిమా వార్తలు

ఎక్స్ క్లూజివ్ : వాళ్లిద్దరూ డివోర్స్ వద్దనుకున్నారు !

Tollywood Couple
టాలీవుడ్ లో వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. రెండు జెనరేషన్స్ నుంచీ ఇండస్ట్రీలో ఉంది ఆ ఫ్యామిలీ. పైగా ఈ ఫ్యామిలీ పెద్దాయనకి క్రమశిక్షణ అంటే ప్రాణం. ఆయన పేరు చెబితేనే అందరూ కాస్త భయపడతారు. ఒకప్పుడు స్టార్ హీరోగా బాగానే కలెక్షన్స్ ను సాధించి.. అటు నిర్మాతగానూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న ఈ హీరోగారి వారసులు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సక్సెస్ కోసం బాగానే కష్టపడుతున్నారు.

అయితే ఆయన వారసుల్లో ఒకరు నటిగానూ, నిర్మాతగానూ, హోస్ట్ గానూ ఇలా పలు పాత్రలు పోషిస్తూ ముందుకు వెళ్తుంది. అయితే ఆమెకు పర్సనల్ లైఫ్ లో భర్తతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, గత సంవత్సరం నుండి భార్య భర్తలకు సరిగా సెట్ అవ్వట్లేదు అని, అందుకే వారిద్దరూ చాలాకాలం నుండి దూరంగా ఉంటున్నారని ఇలా చాల రకాలుగా వార్తలు వచ్చాయి. అలాగే వాళ్లిద్దరూ డివోర్స్ తీసుకోవడానికి కూడా డిసైడ్ అయ్యారని, ఆ మధ్య ఇండస్ట్రీ క్లోజ్ సర్కిల్స్ లో టాక్ వినిపించింది.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం… ఈ జంట మళ్ళీ కలిసిపోయినట్టు తెలుస్తోంది. తమ పాప భవిష్యత్తు కోసం ఇద్దరూ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యారట. మొత్తానికి ఇరువురు సుముఖంగానే డివోర్స్ వరకూ వెళ్లకుండా కూర్చుని తమ సమస్యలను పరిష్కరించుకున్నారట. అన్నట్టు ఈ భార్యాభర్తలు కలవడానికి ఆమె తమ్ముడే కారణం అట. అతను వల్లే ఇద్దరూ తమ కోపాన్ని వదిలి కూల్ అయ్యారట.

అయితే విచిత్రంగా అతని లైఫ్ లో డివోర్స్ ఉండటం బాధాకరమైన విషయం. ప్రస్తుతం అతను హీరోగా నిలబడటానికి కసరత్తులు చేస్తున్నాడు. ఏది ఏమైనా తన జీవితంలో జరిగిన చేదు సంఘటనను తన ఫ్యామిలీలో మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడ్డాడు ఆ హీరో.

Back to top button