సినిమాసినిమా వార్తలు

Biggboss-5: బిగ్ బాస్ 5 నడుస్తుందా? మధ్యలో ఆగుతుందా?

Third-wave Scare For Bigg Boss 5

తెలుగులోనే నంబర్ 1 రియాలిటీ షో.. అత్యధిక రేటింగ్ సాధించే బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ ప్రారంభానికి వేళైంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సీజన్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. వచ్చే నెలలలో కొత్త సీజన్ ప్రారంభించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నా.. ప్రస్తుతం కోవిడ్ 19 నిబంధనలు, థర్డ్ వేవ్ భయం ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 4లో కూడా కరోనా వైరస్ భయం టీంను బాగా వెంటాడింది. భయపెట్టింది. కానీ ఎలాగోలా పూర్తి చేశారు. ఇతర భాషల్లో బిగ్ బాస్ ల్లో మాత్రం కరోనా దెబ్బతో ఏకంగా మధ్యలోనే బిగ్ బాస్ లను రద్దు చేసిన పరిస్థితి నెలకొంది.

బిగ్ బాస్ కన్నడలో పాల్గొనే వారు షో సమయంలోనే కరోనా బారిన పడి మధ్యలోనే ఇంటికి పంపించివేయబడ్డారు. అధికారులు ఈ షో నిర్వహణ అనుమతిని కూడా రద్దు చేశారు. ఆ తర్వాత వారిని తిరిగి రప్పించి అనుమతి పొందిన తర్వాత తిరిగి షోను కంటిన్యూ చేసిన పరిస్థితి..

కేరళలో వరదలు, కోవిడ్ 19 తీవ్రత కారణంగా మలయాళం బిగ్ బాస్ షోను రెండు సార్లు రద్దు చేశారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ భయాలు మళ్లీ మొదలయ్యాయి. అన్ని ప్రొటోకాల్స్ అనుసరించి తెలుగులో బిగ్ బాస్5 సీజన్ ను కొనసాగించడం నిర్వాహకులకు ఇప్పుడు పెను సవాల్ గా మారింది.

బిగ్ బాస్ తెలుగు నిర్మాతలు ఎలాంటి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కార్యకలాపాలకు అసలు అనుమతి లేకుండా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటూ ఈ సీజన్ నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 5ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా దెబ్బ కు తెలుగు బిగ్ బాస్ నడుస్తుందా? మధ్యలోనే ఆగుతుందా? అన్న భయాలు నిర్వాహకులను వెంటాడుతున్నాయి.

Back to top button