అత్యంత ప్రజాదరణజాతీయంప్రత్యేకంరాజకీయాలు

దేశానికి థర్డ్ వేవ్ ముప్పు.. ఎప్పుడంటే?

Third wave threat to the country .. When?

Corona

చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా మహమ్మారి రూపాలు మార్చుకుంటూ వేవ్ ల పేరిట విరుచుకుపడుతూనే ఉంది. దేశంలో కరోనా వైరస్ గత ఏడాది మొదటి వేవ్ తో విరుచుకుపడింది. ఆనాడు వృద్ధులను బలితీసుకుంది. ఇక సెకండ్ వేవ్ ఈ ఏడాది వేసవిలో దేశంపై దండయాత్రే చేసింది. ముఖ్యంగా యువత 45 ఏళ్ల లోపు వారిని కబళించింది. సెకండ్ వేవ్ తో దేశంలో మరణ మృదంగమే వినిపించింది. ప్రతీ కుటుంబంలోనూ ఓ కేసు, ప్రతి గ్రామంలోనూ మరణాలు చోటుచేసుకున్నాయి.

లాక్ డౌన్ తో సెకండ్ వేవ్ ముప్పు తొలిగిపోయిందనుకుంటున్న తరుణంలో శాస్త్రవేత్తలు మరో హెచ్చరిక జారీ చేశారు. మూడో వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ముప్పు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో మూడో వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో సెప్టెంబర్-అక్టోబర్ మధ్యకాలంలో మూడో దశ కరోనా వ్యాప్తి మళ్లీ దారుణంగా ఉంటుందని ఐఐటీ కాన్పుర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి దేశంలో థర్డ్ వేవ్ ముప్పు తప్పదన్న ఆందోళన దేశ ప్రజల్లో నెలకొంది. రెండో వేవ్ దేశంలో దారుణాతి దారుణాలకు కారణమైంది. కుటుంబాలకు కుటుంబాలనే బలితీసుకుంది. ఈ నేపథ్యంలోనే మూడో వేవ్ వస్తుందన్న హెచ్చరికలు మరోసారి దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

రెండో దశతో పోలిస్తే మూడో దశ తీవ్రత తక్కువగానే ఉంటుందని ఐఐటీ శాస్త్రవేత్తలు తెలిపారు. వైరస్ వేరియంట్ ల ప్రభావం తక్కువగా ఉంటుందని వివరించారు. సెప్టెంబర్ నాటికి కరోనా వైరస్ తీవ్రత గరిష్ట స్థాయికి చేరుతుందని.. అక్టోబర్ చివరకు వరకు కొనసాగుతుందని తేలింది.

రెకొన్ని ఈశాన్యరాష్ట్రాలు మిజోరం, మణిపూర్, సిక్కిం మినహా దేశంలో రెండో దశ పూర్తిగా తగ్గిపోయిందని తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం కేరళ, గోవా, సిక్కిం, మేఘాలయ, రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి పైగా ఉండగా.. చాలా రాష్ట్రాల్లో 5శాతం కంటే తక్కువగా ఉంది.

దేశంలో సెప్టెంబర్ వరకు వ్యాక్సినేషన్ ను వేగవంతం చేస్తే ఖచ్చితంగా వైరస్ ప్రభావాన్ని అరికట్టవచ్చని నిపుణులు తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేయాలని కోరారు.

Back to top button