అత్యంత ప్రజాదరణక్రీడలుప్రత్యేకం

ఆ 4 బంతులే సన్ రైజర్స్ ను ఓడించాయి

Those 4 balls were the only ones to beat the Sunrisers

సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ లో ఓడిపోయింది. కేవలం 10 పరుగుల తేడాతో తృటిలో మ్యాచ్ చేజారిపోయింది. జానీ బెయిర్ స్టో దూకుడుగా ఆడుతూ సన్ రైజర్స్ ను గెలిపించడం ఖాయమనుకుంటున్న దశలో అతడికి ఔట్ చేసిన కోల్ కతా బౌలర్ పాట్ కమిన్స్ సన్ రైజర్స్ ఓటమికి కారణమయ్యాడు.

చెన్నైలో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ ఆద్యంతం నువ్వానేనా అన్నట్టుగా సాగింది. కోల్ కతా బ్యాట్స్ మెన్ రెచ్చిపోవడంతో 188 పరుగుల భారీ లక్ష్యాన్నినిర్ధేశించింది.

అయితే బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహాలు శుభారంభాన్ని ఇవ్వలేదు. వారిద్దరూ త్వరగా ఔట్ కావడంతో మనీష్ పాండే, జానీ బెయిర్ స్టో రంగంలోకి దిగారు. బెయిర్ స్టో దూకుడుగా ఆడుతూ 40 బంతుల్లోనే 55 పరుగులతో బాగా ఆడుతూ సన్ రైజర్స్ ను గెలిపించేలా కనిపించాడు. కానీ ఒకే ఒక్క ఓవర్ సన్ రైజర్స్ ఓటమికి.. కోల్ కతా గెలుపునకు కారణమైంది. ఆ నాలుగు బంతుల వ్యవధిలోనే మ్యాచ్ ను పాట్ కమిన్స్ మలుపు తిప్పాడు.

హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తుండగా ఇన్సింగ్స్ 13వ ఓవర్ లో పాట్ కమిన్స్ ఆ ఓవర్ లో మూడు బంతులను డాట్స్ వేశాడు. జానీ బెయిర్ స్టో కొట్టలేకపోయాడు. ఇక 146 కి.మీల వేగంతో వేసిన బంతిని ఫ్లిక్ చేయగా సైడ్ లో స్లిప్ క్యాచ్ ద్వారా బెయిర్ స్టో అవుటయ్యాడు. ఆ నాలుగు బంతులే సన్ రైజర్స్ కొంప ముంచాయి. మూడు బంతులకు పరుగులు రాకపోవడంతో టెంప్ట్ అయిన బెయిర్ స్టో కొట్టే ప్రయత్నంలో ఔట్ అయ్యాడు.

బెయిర్ స్టో ఔట్ అయ్యాక సన్ రైజర్స్ వేగంగా వికెట్లు కోల్పోయి మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. పరుగులు చేయడం కష్టమైంది. అయితే మరో ఎండ్లో మనీష్ పాండే 61 నాటౌట్ ఎంత పోరాడినా సన్ రైజర్స్ ను విజయానికి 10 పరుగుల దూరంలోకి తీసుకొచ్చి నిలబెట్టాడు. అయితే గెలిపించలేకపోయాడు.

Back to top button