విద్య / ఉద్యోగాలు

తెలంగాణలో 199 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

Telangana Institute of Medical Sciences Recruitment 2021

తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 199 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టిమ్స్ డైరెక్టర్ పేరుతో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ పూపరింటెండెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డిప్యూటి నర్సింగ్ సూపరింటెండెంట్, స్టాఫ్ నర్స్, డైటీషియన్, ఫార్మాసిస్ట్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోంది.

వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుండగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. https://dme.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. మొత్తం 199 ఖాళీలలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 94 ఉండగా ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 12 అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 23 ఉన్నాయి.

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ ఖాళీలు 22 ఉండగా నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 ఉద్యోగ ఖాళీలు 1, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ లేదా హెడ్ నర్స్ ఉద్యోగ ఖాళీలు 6, స్టాఫ్ నర్స్ ఉద్యోగ ఖాళీలు 32, డైటీషియన్ ఉద్యోగ ఖాళీలు 32, ఫార్మాసిస్ట్ ఉద్యోగ ఖాళీలు 8 ఉన్నాయి. పోస్టును బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లాలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. https://dme.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Back to top button