ఆరోగ్యం/జీవనం

ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహరాలివే..?

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పట్టణాలు, పల్లెలు అనే తేడాల్లేకుండా అన్నిచోట్ల వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ ను సులభంగా పెంచుకోవచ్చు. కరోనాకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు ఇప్పటివరకు మందులు అందుబాటులోకి రాలేదు.

కరోనా వ్యాక్సిన్ తో వైరస్ కు చెక్ పెట్టే అవకాశం ఉన్నా కొంతకాలం మాత్రమే వ్యాక్సిన్ పని చేస్తుంది. మళ్లీ బూస్టర్ డోస్ వేసుకుంటే మాత్రమే శరీరంలో వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అయితే సహజంగా ఏర్పడే ఇమ్యూనిటీ పవర్ ద్వారా మాత్రమే కరోనా వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఉంటే కరోనా సోకినా త్వరగా కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయి.

కరోనా మహమ్మారిని జయించాలంటే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి ప్రయోజనం చేకూరుతుంది. కమల, నారింజ, నిమ్మ, దానిమ్మ లాంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. గ్రీన్ టీ, వెల్లుల్లి, అల్లం, బొప్పాయి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను సులభంగా పెంచుతాయి. చేపలు తినడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. పీతలు మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.

ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా కూడా సులభంగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునే అవకాశం ఉంటుంది. వీలైనంత ఎక్కువగా నీటిని తాగుతూ సామాజిక పరిశుభ్రతను పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

Back to top button