అత్యంత ప్రజాదరణఆరోగ్యం/జీవనం

సులభంగా ముఖంపై మొటిమలను మాయం చేసే చిట్కాలివే..?

మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం వల్ల చాలామంది మొటిమల సమస్యతో బాధ పడుతున్నారు. టీనేజర్స్ ను ఎక్కువగా మొటిమల సమస్య వేధిస్తూ ఉంటుంది. మొటిమలు పోయినా మొటిమల వల్ల ముఖంపై వచ్చిన మచ్చలు అలాగే ఉండిపోతాయి. అమ్మాయిలు, మహిళలు మొటిమల కోసం రకరకాల క్రీములు వాడినా చాలా సందర్భాల్లో ఆ క్రీముల వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.

ఆయిల్ ఫేస్ ఉన్నవాళ్లను ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా తక్కువ సమయంలోనే ముఖంపై మొటిమలను సులభంగా పోగొట్టుకోవచ్చు. మొటిమలతో బాధ పడేవాళ్లు నిల్వ ఉంచిన ఆహారపదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. మొటిమలను గిల్లడం, గీకడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురయ్యేవారిని మొటిమల సమస్య వేధిస్తుంది.

యోగా, ప్రాణాయామం ద్వారా ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు. ముఖాన్ని మూడుపూటలా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. నూనె, కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వీలైనంతగా తగ్గించాలి. సరైన నిద్ర ఉండేలా చూసుకోవడం, తరచూ సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి.

దాల్చిన చెక్కను పేస్టులా తయారు చేసుకునీ మొటిమలకు రాసినా మొటిమలు తగ్గుతాయి. తులసి ఆకులను మెత్తగా నూరి అందులో రెండు చుక్కల నిమ్మరసం వేసి మొటిమలకు రాసినా మంచి ఫలితం దక్కుతుంది. టమాటా గుజ్జును ముఖంపై ఉన్న మొటిమలకు రాసినా మొటిమలు తగ్గుతాయి. ఐస్ గడ్డలను మొటిమలపై రుద్దినా మంచి ఫలితం ఉంటుంది.

Back to top button