ఏసీని తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచితే ఆరోగ్య సమస్యలు వస్తాయా..?
ప్రస్తుత కాలంలో ఏసీల వినియోగం సాధారణమైంది. వేసవికాలం ప్రారంభం కావడంతో ఏసీల కొనుగోళ్లు కూడా అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. చాలామంది ఏసీలను 20 నుంచి 22 డిగ్రీల మధ్య ఉంచుతారు. అయితే ఏసీని తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచితే గది ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది. మన శరీరం 23 డిగ్రీల నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు సులభంగా తట్టుకోగలదు.
గది ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే ఆ ప్రభావం రక్తప్రసరణపై పడుతుంది. ఏసీ తక్కువ ఉష్ణోగ్రతలో ఉన్న సమయంలో చెమట పట్టదు కాబట్టి శరీరం నుంచి చెమట బయటకు రాదు. ఫలితంగా చర్మ సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రతలో ఏసీని ఉంచడం ద్వారా ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశంతో పాటు భారీగా కరెంట్ బిల్లులు వచ్చే అవకాశం ఉండుంది.
ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఫిల్టర్స్ శుభ్రంగా ఉంటే గది త్వరగా చల్లబడే అవకాశాలు ఉంటాయి. ఏపీ ఉష్ణోగ్రతను 26 డిగ్రీల దగ్గర ఉంచుకుంటే మంచిది. ఏసీ వాడే సమయంలో సీలింగ్ ఫ్యాన్ ను వాడకపోవడం ఉత్తమమని చెప్పవచ్చు. ఏసీ ఉన్న గదిని ప్రతిరోజూ వెట్ క్లాత్ తో తుడుచుకుంటే మంచిది. ఏసీ తరచూ ఆన్, ఆఫ్ చేసినా కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది.
విండో ఏసీని వినియోగించడం కంటే స్ప్లిట్ ఏసీని తీసుకుంటే మంచిది. ఏసీని గది మధ్య భాగంలో ఉంచుకుంటే మంచిది. గదికి అవసరమైన పరిమాణంతో పోలిస్తే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని తీసుకోవాలి.