అత్యంత ప్రజాదరణక్రీడలుప్రత్యేకం

నేడు ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్:గెలుపెవరిది?

Today Delhi vs Rajasthan: Who won?

ఐపీఎల్ జోరుమీద ఉంది. గత రెండు మూడురోజులుగా మ్యాచ్ లు టైట్ గా వస్తూ నువ్వానేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగుతున్నాయి. గత రెండు రోజుల్లో తక్కువ స్కోరింగ్ చేసిన రెండు మ్యాచ్ లు చివరిదాకా సాగి అభిమానులను థ్రిల్లింగ్ కు గురిచేశాయి. ఓడిపోయినా గత మ్యాచ్ లో చివరి వరకు ప్రత్యర్థిని బెంబెలెత్తించి మంచి ప్రదర్శన చేసిన రాజస్థాన్ కసిగా ఉంది. ఇక తిరుగులేని ఫాంలో ఢిల్లీకి ఎదురే లేకుండా ఉంది. ఈరోజు వీరిద్దరి ఆట అభిమానులకు మజాను పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈరోజు రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ డేర్ డెవిల్స్ టీంలు తలపడబోతున్నాయి. ఈరోజు సాయంత్రం టఫ్ ఫైట్ కు రెడీ అయ్యాయి. చెన్నైలో లో స్కోరింగ్ మ్యాచ్ లు జరుగుతుండగా.. ముంబైలోని వాంఖడే స్టేడియం ఫ్లాట్ పిచ్ పై మాత్రం భారీ స్కోరింగ్ మ్యాచ్ లు నమోదవుతున్నాయి. ఈ రాత్రి జరగనున్న వీరిఫైట్ కూడా భారీ స్కోరు మ్యాచ్ గా ఆశించవచ్చు. సిఎస్‌కెపై ఢిల్లీ ఘన విజయం సాధించి మంచి ఊపు మీద ఉండగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై చివరిదాకా పోరాడి ఓడిపోయి రాజస్థాన్ రాయల్స్ గెలువాలని పట్టుదలగా ఉంది.

బెన్ స్టోక్స్ లేకపోవడం రాజస్థాన్ టీంను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వేలు గాయం కారణంగా అతడు ఈ ఐపీఎల్ సీజన్ నుండి తప్పుకున్నాడు. జట్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లెర్ ఇక స్టోక్స్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ చివరి మ్యాచ్ లో అసాధారణమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశారు. వారి బౌలింగ్ మాత్రమే ఆందోళన కలిగిస్తోంది.. కొత్తగా వచ్చిన చేతన్ సకారియా తప్ప, చివరి గేమ్‌లో ఎవరూ బాగా రాణించలేదు. క్రిస్ మోరిస్, ముస్తఫిజుర్ రెహ్మాన్ వంటి ఆటగాళ్ళు పరుగులు చేయకుండా అడ్డుకోలేకపోయారు.

మరో వైపు, సమతుల్యంగా ఉన్న జట్టుతో ఢిల్లీ డేర్ డెవిల్స్ భీకరంగా కనిపిస్తోంది. శ్రేయాస్ అయ్యర్ లేకపోవడం వారిని అస్సలు ప్రభావితం చేయడం లేదు. కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ దూకుడుగా ముందుకెళుతున్నాడు. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా జట్టుకు శుభారంభాలు అందిస్తూ పటిష్టమైన పునాది వేస్తున్నారు. వీరిద్దరూ మంచి ఫామ్ లో ఉన్నారు.. ఈ ఫ్లాట్ పిచ్ మీద వారు అన్ని మరింతగా చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో స్పిన్నర్లు విఫలమైనప్పటికీ.. పేసర్లు ఢిల్లీ తరుఫున బాగా రాణించారు. అశ్విన్ మరియు మిశ్రా తమ లయను అందుకుంటే ప్రత్యర్థి జట్టుకు కష్టమే. మొత్తం మీద ఈ మ్యాచ్ లో భారీ స్కోరు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగనుంది.

Back to top button