టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

Tollywood Movies Latest Updates : మెగాస్టార్ కి 80 మిలియన్ల వ్యూస్, సంపూకి 300 థియేటర్లు !

'ఆర్ఆర్ఆర్' ప్రస్తుత షెడ్యూల్ ఉక్రెయిన్ లో నిన్నటితో ముగిసింది. సంపూర్ణేశ్ బాబు 'బజార్ రౌడీ' సినిమా 300 థియేటర్లలో రిలీజ్ అవుతుండటం విశేషం. మెగాస్టార్ 'లాహే లాహే .. ' పాటకు ఇప్పటి వరకు 80 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

Tollywood Upcoming Moviesటాలీవుడ్ (Tollywood) లో నేటి ఎక్స్ క్లూజివ్ సినిమా (Movie) కబుర్ల విషయానికి వస్తే.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్'(RRR) సినిమా ప్రస్తుత షెడ్యూల్ షూటింగ్ ఉక్రెయిన్ లో నిన్నటితో ముగిసింది. నేడు చిత్రబృందం హైదరాబాదుకు తిరిగి వచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించి షూట్ కేవలం ఆరు రోజుల మాత్రమే మిగిలి ఉంది.

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తెలుగు – తమిళ భాషల్లో ఒక సినిమా చేసింది. ఆ సినిమా పేరు ‘సానికాయిధమ్’. తెలుగులో ఇంకా పేరు పెట్టలేదు. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఐతే, కీర్తి సురేష్ మెయిన్ లీడ్ గా వచ్చిన ఏ సినిమా ఇంతవరకు సక్సెస్ కాలేదు.

ఇక ‘వకీల్ సాబ్’లో కీలక పాత్రలో నటించిన అంజలి… ‘రామ్ చరణ్ – శంకర్’ పాన్ ఇండియా సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోందని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సంపూర్ణేశ్ బాబు ‘బజార్ రౌడీ’ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. పైగా 300 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటం విశేషం.

దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో నితిన్ హీరోగా రానున్న ‘మాస్ట్రో’ సినిమా 32 కోట్లకు ‘డిస్నీ హాట్ స్టార్’ వారు కొన్నారు. ‘వినాయకచవితి’ కానుకగా వచ్చే నెల 10వ తేదీన ఈ సినిమా ప్రసారం కానుంది.

ఆచార్య నుండి వచ్చిన ‘లాహే లాహే .. ‘ పాట మంచి విజయం సాధించింది. ఇప్పటి వరకు ఈ పాట 80 మిలియన్ల వ్యూస్ (80 million views) వచ్చాయి.

Back to top button