Top Storiesప్రత్యేకంసినిమా వార్తలు

బాక్సాఫీస్ సమ్మర్ వార్.. బ‌రిలో బ‌డా స్టార్స్‌!

Tollywood
లాక్ డౌన్ తర్వాత జ‌న‌వ‌రి నుంచి సినిమాల సంద‌డి మొద‌లైంది.. కానీ, బ‌డా స్టార్స్ మూవీస్ ఒక‌టీ రెండు మాత్ర‌మే క‌నిపించాయి. దీంతో అనుకున్నంత సంబ‌రాలు క‌నిపించ‌లేదు. కానీ.. ఏప్రిల్ నుంచి ఇక బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డే సంద‌డి. ఈ నెల‌లో ప్ర‌తీ వారం ఓ బ‌డా మూవీ రిలీజ్ కాబోతోంది. దీంతో.. థియేట‌ర్ల వ‌ద్ద సినిమాల జాత‌ర క‌నిపించ‌బోతోంది.

ఏప్రిల్ 2 అంటే.. రేపు కింగ్ నాగార్జున మూవీ ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో నాగ్‌ ఎన్ఐఏ ఆఫీస‌ర్ గా న‌టించారు. టెర్ర‌రిస్టుల‌ను ఏరిపారేసే ఆఫీస‌ర్ విజ‌య్ వ‌ర్మ‌గా ఆయ‌న క‌నిపించ‌నున్నారు. ఇదే రోజున కోలీవుడ్ హీరో కార్తీ ‘సుల్తాన్’తోపాటు ‘యువరత్న’ అనే మ‌రో డ‌బ్బింగ్ మూవీ కూడా రిలీజ్‌కాబోతోంది.

ఇక సెకండ్ వీక్ ఏప్రిల్ 9న ‘వ‌కీల్ సాబ్‌’ సోలోగా వ‌చ్చేస్తున్నారు. దాదాపు మూడేళ్ల త‌ర్వాత వ‌స్తున్న ప‌వ‌ర్ స్టార్ సినిమా కావడంతో.. ఆ రోజున త‌మ సినిమాను బ‌రిలో నిలిపేందుకు ఏ నిర్మాత కూడా సాహ‌సం చేయ‌లేదు. కేవ‌లం టీజర్ రిలీజ్ కే ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక‌, సినిమా రిలీజ్ రోజున ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మూడో వారం ఏప్రిల్ 16న మ‌ళ్లీ మూడు సినిమాలు బ‌రిలో నిల‌వ‌న‌న్నాయి. శేఖ‌ర్ క‌మ్ముల – నాగ‌చైత‌న్య కాంబోలో వ‌స్తున్న ‘లవ్ స్టోరీ’తోపాటు ‘99 సాంగ్స్’, ‘కనుబడుట లేదు’ అనే సినిమాలు స్లాట్ బుక్ చేసుకొని సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు చిత్రాల్లో ‘ల‌వ్ స్టోరీ’పై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

ఆ త‌ర్వాత వారంలో 23న నాని ‘ట‌క్ జ‌గ‌దీష్‌’, తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ ‘తలైవి’, ‘శుక్ర’ అనే సినిమాలో బరిలో దిగనున్నాయి. ఇందులో టక్ జగదీష్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక, ఆఖరి శుక్ర‌వారం రానా ‘విరాట పర్వం’ రంగంలోకి దిగుతోంది. దీనితోపాటు రిలీజ్ వాయిదాపడిన గోపీచంద్ సీటీ మార్ కూడా వచ్చేఛాన్స్ కనిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా రేపే (ఏప్రిల్ 2న) రావాల్సి ఉంది. కానీ.. అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. ఈ విధంగా ఏప్రిల్ స‌మ్మ‌ర్ బాక్సాఫీస్ వార్ దుమ్ములేసిపోవ‌డం ఖాయం. మ‌రి, ఇందులో ఆడియ‌న్స్ మెచ్చేవెన్నో.. కాసులు కురిపించేవి ఎన్నో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button