కరోనా వైరస్లైఫ్‌స్టైల్

అతిగా ఆవిరి పడుతున్నారా.. ప్రమాదమేనంటున్న వైద్యులు..?

కరోనా మాహమ్మారి బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆవిరి పట్టడం ద్వారా వైరస్ బారిన పడమని చాలామంది విశ్వసిస్తున్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత త్వరగా కోలుకోవడానికి మరి కొంతమంది ఆవిరి పట్టడం ప్రారంభించారు. అయితే ఎక్కువగా ఆవిరి పట్టడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.

కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటం వల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రజల్లో చాలామంది కరోనా సోకకుండా ఇతరులు చెప్పిన సలహాలు, సూచనలు విని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కరోనా బాధితుల్లో 90 శాతం మందికి స్వల్ప లక్షణాలతోనే కరోనా నెగిటివ్ వస్తుండటం గమనార్హం. ఇతర వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో మాత్రమే కరోనా తీవ్రస్థాయికి చేరుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్నవాళ్లు కరోనా బారిన పడితే 9 రోజులకే నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ముక్కు దిబ్బడ అధికంగా ఉంటే మాత్రమే రెండు రోజుల పాటు ఐదు నిమిషాలు ఆవిరి పట్టాలని కేవలం నీటితోనే ఆవిరి పట్టాలని వైద్యులు చెబుతున్నారు. కర్పూరం, ఇతర ఆవిరి ట్యాబ్లెట్లను వినియోగించవద్దని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఆవిరి వల్ల కరోనాపై ఎలాంటి ప్రభావం ఉండదని వైద్యులు వెల్లడిస్తున్నారు.

ఎక్కువగా ఆవిరి పట్టడం వల్ల మ్యూకస్‌ పొరతో పాటు దానిపై ఉండే సీలియా పాడవుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆవిరి నీటిలో కర్పూరం లాంటి పదార్థాలను కలిపితే ఆక్సిజన్ శాతం పెరుగుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

Back to top button