టాలీవుడ్సినిమా

రామ్‌కు ఎంతో మేలు చేసిన ఎన్టీఆర్

Trivikram Srinivas With Ram
టాలీవుడ్ టాప్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడ ఒకరు. ఆయన గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది. దీంతో తర్వాతి సినిమా కూడ భారీగానే ఉండాలని ఎన్ఠీఆర్ హీరోగా ప్రాజెక్ట్ ప్రకటించారు. అంతా సరిగ్గా ఉంటే ఈపాటికి వీరి సినిమా మొదలవ్వాల్సింది. కానీ లాక్ డౌన్ పుణ్యమా అని త్రివిక్రమ్ ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి.

Also Read: కరోనా ఎఫెక్ట్ కు తిరుగులేని మందు పవర్ స్టారేనా?

లాక్ డౌన్ రావడంతో ఎన్టీఆర్ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాపడిపోయింది. ఇంకా చాలా షూట్ బ్యాలన్స్ ఉండిపోయింది. అది పూర్తికావాలంటే ఇంకొన్ని నెలలు పడుతుంది. అప్పటివరకు తారక్ వేరే సినిమా చేయకూడదనే కండిషన్ ఉంది. అందుకే త్రివిక్రమ్ సినిమా ఆలస్యం కానుంది. అటు ఇటుగా ఇంకో నాలుగు నెలలు ఆ సినిమా మొదలయ్యే అవకాశం లేదు. అందుకే ఈ నాలుగు నెలల గ్యాప్లో ఇంకో సినిమా చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నాడు.

Also Read: శర్వానంద్ సెటప్ చూస్తే అదరహో అనాల్సిందే

ముందుగా స్టార్ హీరోతోనే చేయాలనుకున్నారు. కానీ పెద్ద హీరోలందరూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందుకే త్రివిక్రమ్ కాస్త కిందకు దిగొచ్చి మీడియమ్ రేంజ్ హీరో దగ్గర ఆగారు. ఆ వెతుకులాటలో ఆయనకు రామ్ తగిలాడు. ‘రెడ్’ తర్వాత రామ్ సినిమాలేవీ కమిటవ్వలేదు. అందుకే త్రివిక్రమ్ ఆయనతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట. గురూజీ కథ చెప్పడం, రామ్ ఒకే చేయడం చకచకా జరిగిపోయాయట. మొత్తానికి ఎన్టీఆర్ ఆలస్యం రామ్ కు ఈ విధంగా కలిసొచ్చింది. ఈ సినిమా గనుక హిట్టయితే ఆయన మార్కెట్ స్థాయి కూడ మారిపోతుంది

Back to top button