టాలీవుడ్సినిమా

చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసిన త్రివిక్రమ్, థమన్ !

Trivikram Thaman
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మధ్య మంచి అనుబంధం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే తిరుపతికి వెళ్లేందుకు త్రివిక్రమ్ ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్ ని బుక్ చేసుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ మధ్య కోవిడ్ కారణంగా రెగ్యులర్ ఫ్లైట్ లో వెళ్లేందుకు సెలెబ్రిటీలు జంకుతున్న సంగతి తెలిసిందే. అందుకే తక్కువ దూరమైతే సొంత కారులోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

Also Read:  ‘బిగ్ బాస్ 5’కి డేట్ ఫిక్స్.. హోస్ట్ గా కొత్త స్టార్ !

ఇక వేరే స్టేట్స్ కి వెళ్ళాలన్నా స్పెషల్ గా చార్టర్డ్ ఫ్లైట్ లు తీసుకొని వెళ్తున్నారు. ఒకప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ అంటే.. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కానీ, కొంతకాలంగా చార్టర్డ్ ఫ్లైట్ రేట్లు తగ్గాయట. ఇక అప్పటినుండి ప్రముఖులు చార్టర్డ్ ఫ్లైట్స్ నే ఎక్కువుగా వాడుతున్నారట. అయినా స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్లు అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఒక్క సినిమాకే పదుల కోట్లు సంపాదిస్తున్నారు కాబట్టి, చార్టర్డ్ ఫ్లైట్ అనేది వారికీ పెద్ద ఖర్చు అనిపించలేదు లేండి.

Also Read: సింగరేణిలో ప్రభాస్ యాక్షన్ !

ప్రతి స్టార్ డైరెక్టర్ ప్రతి సంవత్సరం 25 నుంచి 30 కోట్లు వెనకేసుకుంటున్నారు. అందుకే… తిరుపతికైనా, వైజాగ్ కైనా స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లగలుగుతున్నారు. పైగా త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ కి సినిమా లాభాల్లో షేర్ కూడా వస్తోంది. ఒక విధంగా సినిమాకి ఓ సీక్రెట్ నిర్మాత లాగా అన్నమాట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button