గుసగుసలుటాలీవుడ్సినిమాసినిమా వార్తలు

మహేష్ తో త్రివిక్రమ్.. ఎన్టీఆర్ ‘బాకీ’ ఎలా?

Trivikram with Mahesh .. How to borrow NTR

‘అజ్ఞాతవాసి’ లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలందరూ వెనకడుగు వేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మాటల మంత్రికుడు త్రివిక్రమ్ ను నమ్మాడు. ఆయన దర్శకత్వంలోనే ‘అరవింద సమేత’ లాంటి ఫ్యాక్షన్ మూవీని తీసి హిట్ కొట్టించాడు.

అందుకే ఇప్పుడు ‘అల వైకుంఠపురంలో’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాక త్రివిక్రమ్ ఎన్టీఆర్ తోనే మూవీ చేస్తానని ప్రకటించాడు. ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అన్న కథతో పాటు మూడు నాలుగు సబ్జెక్ట్ లు అనుకున్నా వర్కవుట్ కాలేదట.. ఇక ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ బిజీగా ఉండడం కూడా త్రివిక్రమ్ మూవీపై పడింది. మొత్తానికి ఇప్పుడు వీరిద్దరి మూవీ క్యాన్సిల్ అయిపోయిందట..

ఇక ఇదే కథతో మహేష్ బాబుతో త్రివిక్రమ్ మూవీ చేయడానికి రెడీ అయిపోయాడట.. పూజాహెగ్డేను కథానాయికగా ఫిక్స్ చేశాడట.. దీంతో ఎన్టీఆర్ తో మూవీ మరుగునపడిపోయినట్టే.

అయితే ఇప్పటికే త్రివిక్రమ్ ఎన్టీఆర్ ఆర్స్ నుంచి కోటి రూపాయలు, నిర్మాత దానయ్య దగ్గర కోటి రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడట.. తన కొత్త ఇంటికోసం వాటిని వినియోగించాడట.. దీంతో వీరిద్దరికి అడ్వాన్స్ తిరిగి ఇద్దామన్నా వారు ఒప్పుకోవడం లేదని.. వారితో ఖచ్చితంగా సినిమా తీయాలని కోరుతున్నారని టాక్. మొత్తానికి త్రివిక్రమ్ ఇప్పుడు తన ఫేవరెట్ నిర్మాత హారిక హాసినితోపాటు ఎన్టీఆర్, దానయ్యలకు మరో రెండు సినిమాలు బాకీ పడ్డట్టు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Back to top button