క్రీడలుజనరల్బ్రేకింగ్ న్యూస్

తడబడ్డ ఢిల్లీ..ఓడి గెలిచిన రాజస్థాన్

Troubled Delhi .. Rajasthan Target reached

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రెండు జట్లు తడబడుతున్నాయి. బౌలర్లు రాజ్యమేలుతున్న ఈ మ్యాచ్ లో పరుగులు చేయడానికి రెండు టీంలు ఆపసోపాలు పడుతున్నాయి.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్ ఉనద్కత్ 3 వికెట్లు తీయడంతో ఢిల్లీకి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఉనద్కత్ వరుసగా ఓపెనర్లు ఫృథ్వీషా, శిఖర్ ధావన్ తోపాటు రహానేను కూడా స్వల్ప స్కోర్లకే ఔట్ చేసి ఢిల్లీని చావు దెబ్బతీశాడు.

అయితే ఢిల్లీని కెప్టెన్ రిషబ్ పంత్ ఆదుకున్నాడు. 51 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. చివరి విడత బ్యాట్స్ మెన్ తలో చేయి వేయడంతో ఢిల్లీ 20 ఓవర్లకు 147 పరుగులకు పరిమితమైంది.

ఇక ఆ తర్వాత చేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కూడా ఢిల్లీ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. క్రిస్ వోక్స్ 2, అవేశ్ ఖాన్ 2, రబాడ 1 వికెట్ తీయడంతో రాజస్థాన్ 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

ప్రస్తుతం మిల్లర్, తెవాటియా రాజస్థాన్ గెలుపు కోసం పోరాడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ఢిల్లీ గెలుపు ఈజీలా కనిపిస్తోంది. మిల్లర్, తెవాటియా ఔట్ అయి నా కూడా చివర్లో అద్భుతమే జరిగింది. ఆల్ రౌండర్ మోరిస్ వరుస సిక్సులు కొట్టి ఓడిపోతుందనుకున్న రాజస్థాన్ కు అద్వితీయమైన విజయాన్ని అందించాడు.

Back to top button