తెలంగాణరాజకీయాలు

బాప్ రే టీఆర్ఎస్ హుజురాబాద్ ఎన్నికల ఖర్చు 700 కోట్లా?

TRS Party in Huzurabad By-Electionహుజురాబాద్ ఉప ఎన్నికలో డబ్బుల వరద పారనుంది. అధికార పార్టీ గెలుపే ధ్యేయంగా తన పలుకుబడిని మొత్తం ఉపయోగించుకుంటోంది. ధన ప్రవాహంలో ఓటర్లను ముంచెత్తనుంది. ఇప్పటికే రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరో రూ.400 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ పై అధికార పార్టీ ఎంతకు తెగించిందో అర్థమవుతోంది. ఈటలను ఢీకొట్టే సందర్భంలో టీఆర్ఎస్ అన్ని దారులను వెతుకుతోంది. సామ వేద దండోపాయాల్లో అన్నింటిని ఉపయోగించుకుని లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అధికార పార్టీ ఆగడాలకు అంతే లేకుండా పోతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరు హుజురాబాద్ వేదికగానే ఉంటూ పని చేస్తున్నారు. కార్యకర్తలను ప్రభావితం చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే క్రమంలో దళిత బంధు పేరుతో కొత్త పథకం తీసుకొచ్చి దళిత ఓటు బ్యాంకుకు గాలం వేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలన్ని విస్మరించి ప్రస్తుతం మళ్లీ కొత్త పథకాలంటూ ప్రజలను మభ్య పెట్టే పనిలో టీఆర్ఎస్ పడిపోయినట్లు తెలుస్తోంది.

హుజురాబాద్ లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమంగా అడ్డదారుల్లో తమ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. పోలీసుల సాయంతో కేసులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఇందు కోసం ఎంతటి దారుణానికైనా వెనుకాడేది లేదని చూస్తోంది. బోగస్ ఓట్లు నమోదు చేయించుకుని తమ అభ్యర్థి విజయం కోసం పాట్లుపడుతోంది.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే టీఆర్ఎస్ పార్టీ పై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఆరోపించారు ఈమేరకు ఆయన భారత ఎన్నిక ల ప్రధాన అధికారికి లేఖ రాశారు. లేఖలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఎన్నికల్లో పంపిణీ చేసే డబ్బుపై దృష్టి పెట్టాలని కోరారు. హుజురాబాద్ లో అధికార పార్టీ అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Back to top button