జాతీయంమిర్చి మసాలారాజకీయాలు

ట్రంప్ పర్యటనతో ఎవరికెంత లాభం..

 

 

 

 

 

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24, 25 వ తేదీలలో భారత్ పర్యటనకు వస్తున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను భారత్ – అమెరికా దేశాలు పూర్తి చేశాయి. ట్రంప్, అమెరికా నుండి బయలుదేరిన దగ్గర్నుండి మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టె వరకు భారీ భద్రత ఏర్పాట్లు నడుమ, మినిట్ టు మినిట్ ప్రోటోకాల్ తో, పక్కా షెడ్యూల్ తో సర్వం సిద్ధం చేసుకున్నాయి.

భారత్ లో ఢిల్లీ, ఆగ్రా అహ్మదాబాద్ ప్రాంతాలలో ట్రంప్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్-అమెరికాల మధ్య ఎటువంటి ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ రాక భారత్ కి ఎంత వరకు మేలు చేస్తుంది. వాణిజ్య పరంగా భారత్ కి ఎటువంటి ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయి. ఏయే రంగాలతో, ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. దిగుమతుల పరిస్థితి ఏమిటి?, ఎగుమతులు ఏమైనా పెరుగుతాయా..? కొత్త ఒప్పందాలతో పెట్టుబడులు ఏమైనా పెరుగుతాయా..? భారత్ యువతకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు పెరిగే పరిస్థితి ఉందా..? అమెరికాలో ఉంటున్న వారికీ వీసా విషయాలలో గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా..? వంటి అనేకమైన ఆసక్తికర విషయాల గూర్చి విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా.. అగ్రరాజ్యం అధ్యక్షుడు భారత పర్యటనకు వస్తున్నారంటే.. ఇది దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్ పర్యటన వల్ల భారత్ కి చేకూరే ప్రయోజనాలు

భారత్ అమెరికా దేశాల మధ్య 1999 నుంచి 2018వరకు వాణిజ్య రంగంలో వృద్ధి గణనీయంగా పెరిగింది. 1999లో 16 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా 2018 నాటికి అది 142 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ వృద్ధిని మరింతగా పెంచాలని భారత్ భావిస్తుంది.

అమెరికా నుండి పెట్టుబడులను ఆకర్షించి, యువతికి ఉపాధి కల్పిస్తూ.. దేశీయ వస్తు సేవల ఉత్పత్తిని పెంచి ఇప్పటికే 20-25బిలియన్ డాలర్ల సర్ ప్లస్ ఉన్న ఎగుమతులను మరింతగా పెంచాలని భారత్ భావిస్తుంది.

పాల ఉత్పత్తుల విషయంలో ఆచి తూచి అడుగులేసి,పాల ఉత్పత్తుల దిగుమతులను తగ్గించాలని భారత్ ఆలోచిస్తుంది.

ఇప్పటికే రక్షణ రంగంలో ఫ్రెంచ్, యూరప్, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలతో భారత్ కి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ అమెరికా దగ్గర ఉన్నంత పటిష్టమైన రక్షణ రంగం ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేదు. కాబట్టి రక్షణ రంగంలో అమెరికాతో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించి భారత్ రక్షణ రంగాన్ని పటిష్టం చేయాలనీ, ఆధునాతన వెపన్స్ ని దిగుమతి కోసం భారత్ ప్రయత్నిస్తోంది.

అమెరికా- చైనా మధ్య వాణిజ్య లోటు దాదాపు 4లక్షల బిలియన్ డాలర్లు కాబట్టి అమెరికా, చైనా ని డైరెక్టుగా ఎదురుకోవడం కష్టం కాబట్టి భారత్ ని వ్యూహాత్మంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది.ఇది భారత్ కి కలిసొచ్చే విషయం.

అమెరికాకి కలిగే ప్రయోజనాలు

ఈ సంవత్సర ముగింపులో అమెరికాలో ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో భారత్ పర్యటనలో “కెమ్ ఛో ట్రంప్” మరింత కలిసొచ్చే విషయం. ఎందుకంటే అమెరికాలో దాదాపు 30 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందులో సంగం మందికి అమెరికాలో ఓటు హక్కు ఉంది. వారిని తన పార్టీకి అనుకూలంగా మార్చుకుంటే ట్రంప్ కి మరింత మేలు చేకూరే అవకాశాలు ఉన్నాయి.

ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఎగుమతులు, దిగుమతుల వల్ల అమెరికా ఇప్పటికే 20-25 బిలియన్ డాలర్ల లోటు వాణిజ్యం ఉంది. దానిని తగ్గించడం కోసం ఎగుమతులను పెంచాలని అమెరికా భావిస్తుంది. అందులో భాగంగానే డైరీ ప్రోడక్ట్స్, చికెన్ లెగ్స్ ఎగుమతులు పెంచాలని అమెరికా ఆలోచన.

భారత్ నుండి అమెరికాకు వస్తున్న వలసదారుల విషయంలో అమెరికా ఇప్పటికే ఉక్కుపాదం మోపింది. అలాగే ప్రస్తుతం ఈ విషయంలో మౌనం వహించి. వీసాల రూల్స్ ని మరింత కఠినతరం చేయాలనీ అమెరికా అనుకుంటుంది.

ట్రంప్, మోడీల స్నేహ బంధం గత మూడేళ్లుగా బలపడుతూ వస్తుంది. అలాగే ట్రంప్ మొదటిసారిగా భారత్ గడ్డపై అడుగుపెడుతున్నారు. “భారత్ తో భారీ డీల్” అంటున్న ట్రంప్ మాటలలో నిజమెంత తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సి ఉంటుంది.