విద్య / ఉద్యోగాలు

టీఎస్ నిరుద్యోగులకు శుభవార్త.. 127 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

TSPSC Recruitment 2021

తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 127 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసి శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీతో పాటు పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

Also Read: 224 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ వేతనంతో..?

https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో మొత్తం 102 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో 15 సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు 10 జూనియర్‌ అసిస్టెంట్‌-టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల వివరాలను వెబ్ సైట్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Also Read: ఇంటర్, డిగ్రీ పాసయ్యారా.. 6552 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

మరోవైపు రాబోయే రోజుల్లో తెలంగాణ సర్కార్ భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ సడలింపుల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

Back to top button