బాలీవుడ్సినిమా

ప్రముఖ నటికి పక్షవాతం.. ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు?

tv actor nishi singh bhadli paralysed

ఈ మధ్య కాలంలో మనుషులు ఆరోగ్య సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరినీ అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ప్రముఖ టీవీ నటి నిషి సింగ్‌ బద్లీ పక్షవాతం బారిన పడిన సంగతి తెలిసిందే. తెలుస్తున్న సమాచారం మేరకు ఆమె ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోంది. టీవీ నటిగా ఆమె ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పటికీ గతేడాది నుంచి ఆమె అనారోగ్యంతో బాధ పడుతూ ఉండటం వల్ల డబ్బంతా ఖర్చైపోయింది.

Also Read : ఎస్పీ బాలు తిట్టడం వల్లే మెగాస్టార్ ఇలా మారాడా?

దీంతో ఆమె భర్త, రచయిత సంజయ్ సింగ్ బద్లీ ఆర్థికసాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ఎవరైనా ఉంటే తనకు సాయం చేసి తన భార్య ప్రాణాలను కాపాడుకోవడానికి తమ వంతు సహాయసహకారాలు అందించాలని చెప్పారు. కామెడీ పాత్రల్లో నటించి మెప్పించిన నిషి షింగ్ దీనస్థితిని చూసి అభిమానులు సైతం కన్నీరుమున్నీరవుతున్నారు. నిషి సింగ్ దాదాపు రెండు దశాబ్దాల నుంచి టీవీ ఇండస్ట్రీలో ఉంది.

ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగల ప్రతిభాశాలి నిషి సింగ్. అయితే ఆమె తొలిసారి గతేడాది ఫిబ్రవరి నెలలో అనారోగ్యానికి గురై పక్షవాతం బారిన పడ్డారు. ఆమె పక్షవాతం నుంచి కోలుకోవడానికి భర్త సంజయ్ ఉన్న డబ్బంతా ఖర్చు చేశాడు. ఫలితంగా ఆమె నిదానంగా కోలుకుంది. అయితే నిషా సింగ్ కు 2020 ఫిబ్రవరి నెలలో మరోసారి పక్షవాతం వచ్చింది. భర్త సంజయ్ చికిత్స కోసం ఉన్న డబ్బంతా ఖర్చు చేయడంతో పాటు తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేశాడు.

చికిత్సకు మరింత ఖర్చు చేయాల్సి ఉండటంతో సంజయ్ దాతల సాయంపై ఆధారపడ్డాడు. ఖుబూల్ హై, ఇష్క్ బాజ్‌, తెనాలి రామ, హిట్లర్ దీదీ లాంటి షోలు దీదీ సింగ్ కు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

Also Read : డ్రగ్ కేసు విచారణకు దీపికా.. భర్త రణవీర్ కు షాక్

Back to top button