వ్యాపారము

రూ.7,999 చెల్లించి టూవీలర్ కొనే ఛాన్స్.. ఎలా అంటే..?

tvs twowheeler brought home on a down payment of rs 7999

ప్రముఖ టీవీలర్ కంపెనీలలో ఒకటైన టీవీఎస్ మోటార్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఈ సంస్థ తమ కంపెనీ వాహనాలపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఎక్కువ మైలేజ్, తక్కువ ధరలో టూవీలర్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లు ఈ వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. టీవీఎస్ మోటార్స్ ఎక్స్ఎల్ 100 వెహికల్‌పై అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది.

కేవలం రూ.7,999 డౌన్ పేమెంట్‌ చెల్లించడం ద్వారా ఈ టూవీలర్ ను కొనుగోలు చేయవచ్చు. టీవీఎస్ ఇతర ఆఫర్లు కూడా అందిస్తుండగా ఆ ఆఫర్ల వల్ల అదనపు బెనిఫిట్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతర వాహనాలతో పోలిస్తే టీవీఎస్ ఎక్స్ఎల్ 100 వెహికల్‌ కొనుగోలు చేయడం ద్వారా 15 శాతం అధిక మైలేజ్ ను పొందవచ్చని కంపెనీ చెబుతుండటం గమనార్హం. ఈ వాహనంలో మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది.

డ్యూయెల్ టోన్ కలర్‌లో ఈ వాహనం లభిస్తుండగా సమీపంలోని టీవీఎస్ షోరూంను సంప్రదించి ఈ వాహనాన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ వాహనాన్ని కొనుగోలు చేసిన వాళ్లు క్యాష్ బ్యాక్ కూడా పొందే అవకాశం ఉంటుంది. పేటీఎం ద్వారా ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో వారికి ఏకంగా 4,500 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. నెలకు రూ.1,555 నుంచి ఈఎంఐ చెల్లించడం ద్వారా ఈ టూవీలర్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ టూవీలర్ ఎక్స్‌షోరూమ్ ధర 50 వేల రూపాయలు కాగా ప్రాంతాన్ని బట్టి ధరలలో స్వల్పంగా మార్పులు ఉంటాయి.

Back to top button