అత్యంత ప్రజాదరణజాతీయంరాజకీయాలు

చత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో ట్విస్ట్

-ఒక పోలీసు బంధీగా ఉన్నాడని మావోయిస్టు లేఖ..

 

చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ లో చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో ట్విస్ట్ నెలకొంది. ఈ ఘటనలో ఇప్పటికే 23మంది పోలీసులు నక్సలైట్లతో ఎదురుకాల్పుల్లో మరణించారు. ఇంకొంతమంది గల్లంతయ్యారని తెలుస్తోంది. అయితే తాజాగా ఒక పోలీసును బందీగా పట్టుకున్నామని దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట ఒక ప్రకటన మావోస్టుల నుంచి వెలువడడం సంచలనంగా మారింది.

ఈ ఎన్ కౌంటర్ లో 23 మంది పోలీసులు చనిపోయారని.. మరో పోలీసు తమ వద్ద బందీగా ఉన్నట్లు మావోయిస్టులు చెప్పారు. అలాగే పోలీసుల దాడిలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రకటనలో తెలిపారు.

మధ్యవర్తి పేరు ప్రకటిస్తే బందీగా ఉన్న పోలీసులను అప్పగిస్తామని.. పేరు ప్రకటించే వరకూ ఆ పోలీసు తమ వద్ద క్షేమంగా ఉంటారని మావోయిస్టులు తెలిపారు.

మొన్నటి బీజాపూర్ ఎన్ కౌంటర్ లో దాదాపు 2వేల మంది పోలీసులు దాడికి వచ్చారని మావోయిస్టులు ఆరోపించారు. దాడికి ప్రతిదాడి చేశామని మావోయిస్టులు చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి అమిత్ షా నాయకత్వంలో ఐదు రాష్ట్రాల పోలీసు అధికారులతో భారీ దాడులకు పథకం పన్నారని లేఖలో మావోయిస్టులు ఆరోపించారు.

ఇక చివర్లో పోలీసులు తమకు శత్రువులు కాదని.. ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. చర్చలకు సిద్ధమని.. ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు.

Back to top button